నన్ను నేను మార్చేసుకున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత్రకు తగిన ప్రిపరేషన్స్ విషయంలో తెలుగు హీరోలు కాస్త ఎక్కువగానే ఉంటారు. పాత్రను సరిగ్గా ప్రజెంట్ చేయడానికి -ప్రీ వర్కౌట్స్ గట్టిగానే ఉపయోగపడతాయన్నది వాళ్ల ఫీలింగ్. ‘గద్దలకొండ గణేష్’తో మాస్ ఎంటర్‌టైనర్ ఇచ్చిన వరుణ్ తేజ్ -తరువాతి ప్రాజెక్టులో బాక్సర్ అవతారం ఎత్తనున్నాడు. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్‌గా కనిపిస్తాడట వరుణ్. ఈ సినిమా కోసం చాలాకాలంగానే వరుణ్ ప్రాక్టీస్ సెషన్స్ కొనసాగిస్తున్నాడు. ముంబయి ట్రైనర్స్ సారథ్యంలో బరువు తగ్గే పనే కాకుండా.. లాస్‌ఏంజెల్స్ బాక్సింగ్ ట్రైనర్ల దగ్గర ప్రత్యేక శిక్షణ సైతం తీసుకుంటున్నాడట. ‘చేసిన ప్రాజెక్టుల్లో వైవిధ్యాన్ని చూపించే అవకాశమొచ్చినా -్ఫజికల్‌గా ఛేంజ్ కావాల్సిన సినిమా ఇప్పటికి పడింది. ఈ పాత్ర కోసం కొత్త ఫిజిక్‌తో ఆడియన్స్ ముందుకొస్తా’ అని ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఈ సినిమాలో వరుణ్‌తో బాలీవుడ్ భామతో జోడీ కట్టే అవకాశం కనిపిస్తోంది. భరత్ అను నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ రుచి చూపించిన కైరా అద్వానీ -ఈ ప్రాజెక్టు కోసం వరుణ్‌తో జోడీ కడుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిత్రబృందం ఆమెను అప్రోచ్ కావడం, ప్రాజెక్టుకు ఆమె అంగీకరించటం జరిగిందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.