హారర్ హ్యాట్రిక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చొచ్చిన జానర్లో ఐదు భాషల్లో వస్తోన్న అనుష్క సినిమా -సైలెన్స్. తెలుగులో నిశ్శబ్ధం. నిన్నటి వరకూ ఇదొక ఆర్ట్ సినిమా అన్న మూడ్ ఉంది. టీజర్ విడుదలతో సినిమా సినే మారిపోయింది. టీజర్ బయటికొచ్చిన రోజు గడవకుండానే టెన్ మిలియన్ వ్యూస్ దాటిపోవడం -అనుష్క సినిమాపై ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని చెప్పకనే చెబుతోంది. సైలెన్స్‌లో అనుష్క, మాధవన్ కీలక పాత్రలు. అనుష్కను కళాకారిణిగా, మాధవన్‌ను వయోలిన్ ఆర్టిస్టుగా డిస్ట్రర్బ్‌డ్ మూడ్స్‌లో ఫస్ట్‌లుక్స్‌తో ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్‌లుక్స్ చూసి ఇదేదో ఆర్ట్ సినిమా అనుకున్న వాళ్లంతా -టీజర్ రిలీజ్‌తో అనుష్కకు అలవాటైన జోనర్లోకే వచ్చేసిందన్న భావన వ్యక్తం చేస్తున్నారు. యంగ్ కపుల్ రొమాంటిక్ టూర్‌లో ఎలాంటి పరిణామాలు సంభవించాయి? ఆహ్లాదకరమైన ప్రకృతిలో గడుపుదామనుకున్న ఆ ప్రేమికుల వెకేషన్ ఎందుకు చిన్నాభిన్నమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే నిశ్శబ్ధం కథ అన్నది టీజర్‌తో అర్థమవుతోంది. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ టీజర్‌ని చూడగానే -స్వీటీ అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అరుంధతితో ట్రెండ్ సెట్ చేసిన స్వీటీ, తరువాత చేసిన భాగమతి సినిమానూ భుజాలపైమోస్తూ సక్సెస్‌వైపు తీసుకెళ్లింది. ఆ సినిమా వచ్చి దాదాపు ఏడాది పూర్తి కావొస్తుండటంతో -అనుష్క సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ రెంటి జోనర్‌లోనే నిశ్శబ్ధం కూడా ఉండటంతో స్వీటీకి ‘హారర్ హ్యాట్రిక్’ ఖాయమన్న మాట వినిపిస్తోంది.