ఇదీ రజనీ దర్బార్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్బార్. సంక్రాంతి సినిమా. పైగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా. మరీ చెప్పాలంటే ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తోన్న సినిమా. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి నాలుగు భాషల్లో సిద్ధమవుతోన్న సినిమాని -జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషనల్ పటాటోపం మొదలైంది. రెండు నెలల ముందునుంచే సినిమాను జనాల బుర్రల్లో నాన్చడానికి లైకా ప్రొడక్షన్స్ పర్ఫెక్ట్ ప్రణాళికను సిద్ధం చేసింది. దర్భార్ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో.. ముందే ప్రకటించినట్టు -గురువారం మోషన్ పోస్టర్‌ను సూపర్‌స్టార్ల చేతుల మీదుగా బయటకు వదిలారు. హిందీ మోషన్ పోస్టర్‌ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేస్తే, మలయాళ మోషన్ పోస్టర్‌ను మోహన్‌లాల్ విడుదల చేశారు. తమిళ మోషన్ పోస్టర్‌ను బర్త్‌డే బోయ్ కమల్‌హాసన్ రిలీజ్ చేస్తే, తెలుగు దర్బార్ మోషన్ పోస్టర్‌ను హీరో మహేష్‌బాబు విడుదల చేశారు. నాలుగు భాషల్లోని సూపర్ హీరోలు దర్బార్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుండటంతో -సినిమాకు మరింత హైప్ వస్తోంది. నయన్‌తార, నివేదా థామస్, సునీల్ శెట్టి, ప్రతీక్‌బబ్బర్ ముఖ్య పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా జనవరి 15న థియేటర్లకు తేనున్నట్టు చిత్రబృందం ప్రకటించటం తెలిసిందే.