చోళ రాజు కథతో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్ ఇండియా సినిమాలపై సౌత్ ఫోకస్ పెరుగుతోంది. బాహుబలి ద బిగినింగ్, కన్‌క్లూజన్‌తో సౌత్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు దర్శకుడు రాజౌవౌళి. తరువాత వచ్చిన 2.0, సాహో, సైరావంటి భారీ చిత్రాలూ సౌత్ సినిమాకు ఓ రేంజ్‌ని క్రియేట్ చేసే ప్రయత్నాలే చేశాయి. ఆ స్థాయిని మరో మెట్టెక్కించే సినిమా సౌత్‌లో రూపుదిద్దుకుంటోంది. మణిరత్నం మస్తిష్కం నుంచి రూపుదిద్దుకుంటున్న ఆ చిత్రం -పొన్నియన్ సెల్వన్. చోళుల రాజ్యపాలన బ్యాక్‌డ్రాప్‌లో వీరుడైన రాజు కథగా సినిమా ఉండనుంది. కథ కన్‌క్లూజన్‌కు రావడంతో ప్రీ ప్రొడక్షన్స్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు మణిరత్నం. ఇదీ.. ‘్భరీ’ సినిమా కావడంతో -బహుబలి మాదిరిగానే రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో మణి ఉన్నాడన్న టాక్ మొదలైంది. వచ్చే నెలలో థాయిలాండ్ వేదికగా సినిమాను గ్రాండ్‌గా లాంచ్‌చేసే అవకాశం ఉందంటున్నారు. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలాధారంగా తెరకెక్కుతోన్న చారిత్రాత్మిక జానపద చిత్రమిది. దక్షిణ భారతాన్ని చోళులు పాలించిన కాలంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఉన్నతుడైన రాజు కథగా సినిమా ఉంటుందంటున్నారు. విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, కీర్తిసురేష్, అశ్విన్, ఆది పినిశెట్టిలాంటి భారీ కాస్టింగ్ ఇప్పటికే ప్రాజెక్టులో ఇన్‌క్లూడ్ అయ్యారు. ఈ పీరియాడిక్ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్‌బాబు.. ఐశ్వర్యకు భర్త పాత్రలో కనిపించొచ్చన్న అంచనాలు లేకపోలేదు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తోన్న సినిమా సౌత్‌లో మరో బాహుబలిస్థాయి చిత్రం కావొచ్చన్న టాక్ వినిపిస్తోంది.