కాంప్రమైజ్ రామకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి రామకృష్ణ బి.ఎ బిఎల్ అంటే పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా రూపొందించాం. జీవితంలో ప్రతిదీ కాంప్రమైజ్ కావాలి అనే మాటను కామెడీ టచ్‌లో ప్రేక్షకులకు నవ్వులు పండించడానికి ఈ సినిమా రూపొందించాము అని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. సందీప్‌కిషన్ కథానాయకుడిగా ఎస్.ఎస్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేశాడు. ప్రస్తుతం ప్రేక్షకులకు స్ట్రెస్ ఎక్కువైపోయి పని, డబ్బు అంటూ జాబ్ టెన్షన్‌లో పడిపోతున్నారు. నవ్వడం మానేశారు. జాబ్ ఎలా చేయాలి, మనీ ఎలా సంపాదించాలి అనే ఆలోచనలతో సతమతమవుతున్నారు. అందుకే లాఫింగ్ క్లబ్‌లు వచ్చాయేమో అనిపిస్తుంది. గతంలో రాజేంద్రప్రసాద్, నరేష్‌లాంటి హీరోలు నవ్వులు పండించారు. ఈ సినిమాలో కూడా నవ్వించే ప్రయత్నం చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు. సినిమాలో పాటలు చాలా హైలెట్‌గా వుంటాయి. రామకృష్ణ ఓ లాయర్. తిమ్మిని బమ్మిని చేయగల దిట్ట. అటువంటి అతను ఓ ప్రమాదం గురించి తెలిసి దాన్ని సరదాగా ఎలా డీల్ చేస్తూ కాపాడాడు అన్న కథనమే ఈ చిత్రంలో వుంటుంది. కాంప్రమైజ్ అవ్వండి అంటూ లాయర్ చెబుతూ మాస్ ఓరియెంటెడ్‌గా పాట వుండాలని ‘రామకృష్ణ తెనాలి నా మాటే వినాలి’ అన్న కానె్సప్ట్ ఓరియెంటెడ్ పాట ప్రేక్షకులకు నచ్చుతుందని నా నమ్మకం. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో కరెప్టెడ్ సెన్స్‌తో ఈ కథ వుంటుంది. ఏదైనా వాదించగలను అంటూ కోర్టులో తిరిగే కుర్ర లాయర్‌గా హన్సిక ఓ అమాయకురాలి పాత్రలో నటించింది. వరలక్ష్మి పాత్ర ఈ సినిమాలో చాలా కీలకమైనది. సందీప్‌కు రెగ్యులర్‌గా వుండే ముద్ర ఈ చిత్రంతో బ్రేక్ అవుతుందని తెలిపారు.