నేనో విద్యార్థిని.. అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదట నేను దర్శకుడిగా నా కెరీర్ ప్రారంభించినా ఇపుడు నటుడిని అయ్యాక ఓ విద్యార్థిగా మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటాను. ఓ నటుడిగా మాత్రమే షూటింగ్‌కు వెళతాను. అంతకు తప్పితే అనవసరమైన పనులలో నా ప్రమేయం ఏదీ ఉండదు అంటూ తెలిపారు దర్శకుడు, నటుడు దేవీప్రసాద్.
రాజేంద్రప్రసాద్, విశ్వంత్, దేవీప్రసాద్ ప్రధాన తారాగణంగా విశ్వనాధ్ మాంగటి దర్శకత్వంలో నిర్మాత దుర్గాప్రసాద్ రూపొందించిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు దేవీప్రసాద్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ఈ చిత్రంలో నేను రాజేంద్రప్రసాద్ కొడుకుగా నటించాను. నా కొడుకుగా విశ్వంత్ చేశాడు. ఫ్యామిలీ డ్రామాగా వున్నా కానీ రెగ్యులర్ ఫార్మాట్‌లో వుండదు ఈ చిత్రం. సినిమాలో అనేక ట్విస్టులు వుంటాయి. కుటుంబ బంధాలు, వాటి విలువలు ఎలా వుంటాయి అనే కోణంలో దర్శకుడు ఈ కథను బాగా డీల్ చేశాడు. సహజంగా కొత్త దర్శకుడంటే, లవ్ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ చిత్రాలను రూపొందిస్తారు. కానీ ఈ దర్శకుడు విశ్వనాధ్ మాగంటికి కుటుంబ విలువలపట్ల మంచి అభిరుచి వుంది. అందుకే ఇలాంటి చిత్రాన్ని రూపొందించాడు. షూటింగ్ గ్యాప్‌లో మేము అప్పుడప్పుడు అనుకొనేవాళ్ళం. కొత్తదర్శకుడేంటి, ఇలాంటి సబ్జెక్టు తీసుకున్నాడేంటి అని. ఓసారి వాళ్ళ నాన్నతో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు, మాకు అతనికి కుటుంబంతో వున్న బాండింగ్ ఎంత గొప్పదో అర్థమైంది. అందుకే ఇలాంటి చిత్రం తీశాడేమో అనుకున్నాం. అతను నాకొకటే చెప్పాడు- నా సినిమా చూసి అందరూ ఆనందపడినట్లుగానే మా అమ్మా, నాన్న సంతోషించాలని చెప్పాడు. అది అతను ఈ చిత్రంలో వందకు వందశాతం చేసి చూపాడు. రాజేంద్రప్రసాద్‌తో దర్శకత్వం అవకాశం అప్పట్లో వచ్చి మిస్ అయింది. అలాంటి లెజెండరీ నటుడిని డైరెక్షన్ చేయలేకపోయానే అని అప్పుడప్పుడు అనుకుంటా. కానీ ఈ చిత్రంలో అతనితో కలిసి నటించడం చాలా ఆనందాన్నిచ్చింది. అతని దగ్గర ఎన్నో మెళకువలు నేర్చుకున్నానే్నను. ముఖ్యంగా సంగీత, నారాయణరావు, చలపతిరావు, ప్రసాద్‌బాబు వంటి సీనియర్లతో పనిచేయడం ఎంతో అనుభవాన్నిచ్చింది. ముఖ్యంగా వారు చెప్పిన అలనాటి అనుభవాలు ప్రతి నటుడికి పాఠాల్లాంటివి. అప్పుడే షూటింగ్ అయిపోయిందా అనిపించేలా వారితో కలిసి చేసిన ట్రావెల్ ఎంతో విలువైనదిగా అన్పించింది. అలాగే నిర్మాత కూడా చాలా కూల్‌గా పకడ్బందీ ప్లాన్‌తో చిత్రాన్ని రూపొందించారు. షూటింగ్‌లో ఎవరూ ఇబ్బంది పడిన దాఖలాలే లేవు. యూనిట్ అంతా పూర్తి హార్ట్ఫుల్‌గా సపోర్టు చేశారు. మా గురువు కోడి రామకృష్ణ దగ్గర పనిచేసేటప్పుడే చిన్న చిన్న మెరుపులాంటి పాత్రలు చేశాను. ఆహా, నువ్వొస్తావని చిత్రాల్లో అవసరార్థం నటించాల్సి వచ్చింది. నీది నాది ఒకే కథ సినిమా చూశాక చాలామంది నా నటనను మెచ్చుకోవడంతో ఆ వైపు కూడా చూసే అవకాశం కలిగింది. అలాగే ఇప్పుడొస్తున్న దర్శకులు ప్రతి పాయింట్‌ను చాలా బాగా డీల్ చేస్తున్నారు. కొత్త దర్శకుల వద్ద మనం ఎన్నో నేర్చుకునేలా వారు వస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. మేకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్‌గా వుంటుంది. ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులను మేనేజ్ చేస్తూ దర్శకుడు సినిమాను రూపొందించడం ఓ అనుభూతి. సినిమా గురించి దర్శకుడికే ఎక్కువ తెలుస్తుంది. అందులో వున్న కథ, స్క్రిప్ట్‌పై అతనికి అవగాహన వుంటుంది. నటుడిగా వెళ్లినవాళ్ళకి ఏం తెలుస్తుంది. మనం షూటింగ్‌కి వైట్‌పేపర్‌లా వెళ్లాలి. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుడికి ఎక్కడో ఓచోట కనెక్టవుతుంది. మన కుటుంబంలో కూడా ఇలాంటివాళ్ళున్నారు కదా, మన మామ ఇలా చేశాడు కదా, మన బాబాయి అట్లా అన్నాడు కదా అన్న ఆలోచన తప్పక ప్రేక్షకుడికి వస్తుంది. చాలా చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ తీసుకుని దర్శకుడు అద్భుతంగా రాసుకున్నాడు. ప్రతి మనిషిలో గుడ్ అండ్ బాడ్ ఆలోచనలు వుంటాయి. అదే ఈ చిత్రంలో చర్చించాం. ప్రతి మనిషిలో వున్న చిన్న చిన్న లోపాలను చక్కగా ఆవిష్కరించాలి. దర్శకత్వం వందశాతం బాధ్యతతో చేయాలి. అదే నటుడికి అంత రిస్క్ వుండదు. ఇప్పటికీ నా బ్లేడ్ బాబ్జి చిత్రం చూసినవాళ్లు ఫోన్ చేస్తూనే వుంటారు. దర్శకుడిగా కామెడీ పండించాను. నటుడిగా మాత్రం అనుకోకుండా సీరియస్ పాత్రలు చేస్తున్నాను. అయితే అన్ని పాత్రలు చేయగలనన్న నమ్మకం నాకుంది. శర్వానంద్‌తో శ్రీకారం, కాదల్, ఆయుష్మాన్‌భవ, సాఫ్ట్‌వేర్ సుధీర్, 22, కృష్ణవంశీతో రంగమార్తాండ, అద్భుతం వంటి చిత్రాలలో ప్రస్తుతం నటించాను. త్వరలో విలన్‌గా కూడా ఓ సినిమాలో అవకాశం వచ్చింది అంటూ వివరించారు.