ఇదో కొత్త అనుభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో కామెడీతో కొన్ని సన్నివేశాలు, చిత్రాలు చేసినా, ఇపుడు మాత్రం వస్తున్న తెనాలి రామకృష్ణ పూర్తిగా కామెడీ జోనర్‌లోనే సాగుతుంది నటుడు సందీప్ కిషన్ తెలిపారు. జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో హన్సిక, వరలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందించిన తెనాలి రామకృష్ణ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను కథానాయకుడు వివరిస్తూ, చిత్రంలో ప్రతి సీన్ సీరియస్‌గానే వున్నా, కామెడీతో ప్రేక్షకులను అలరిస్తుంది. నాకు కామెడీ జోనర్ చాలా ఈజీ. దానికితోడు ఈ దర్శకుడు తోడవ్వడంతో నా పని ఈజీగా మారింది. ఆయన సినిమాలో ప్రతి చిన్న విషయాన్ని చక్కగా డీల్ చేశాడు. షూటింగ్ కూడా ఎంతో ఎంజాయ్ చేశాం. కామెడీ జోనర్‌లో కథలు దొరకడమే చాలా కష్టం. నేననేది ఏమిటంటే, కథలో కామెడీ వుంటే, కామెడీ కోసం కథ ఉండకూడదని. ఇప్పటివరకూ సినిమా చూసినవాళ్ళ రెస్పాన్స్ బాగా వుంది. త్వరలో ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని నా అభిప్రాయం. ఈ చిత్రం తరువాత ఎలాంటి కథలో రావాలా అని ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నాను. బాలీవుడ్‌లో రెండు మూడు అవకాశాలు వచ్చాయి. అయితే ఇక్కడ సేఫ్‌గా ఉన్నాను కదా, తొందరెందుకు అనుకుంటున్నాను. తమిళంలో విడుదలైన చిత్రాలు ఇక్కడ డబ్బింగ్‌లో రావడవంల్ల నా స్ట్రెయిట్ చిత్రాలకు ఒక్కోసారి ఇబ్బంది ఎదురవుతోంది. ఓ టౌన్‌లో జరిగే తెనాలి రామకృష్ణ కథ విజువల్‌గా సరికొత్తగా ఉంటుంది. నవ్విస్తూ న్యాయాన్ని నిలబెట్టే లాయర్‌గా ప్రేక్షకులు నా యాక్షన్‌ను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా రెండు గంటలపాటు గలగలా నవ్విస్తుంది అంటూ ముగించారు.