6న బ్యూటిఫుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై నైనా, సూరి ప్రధాన తారాగణంగా అగస్త్య మంజు దర్శకత్వంలో రామ్‌గోపాల్‌వర్మ అందిస్తున్న చిత్రం ‘బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే నెల 6న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం విశేషాలను తెలుపుతూ ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌కు మొదటి సింగల్‌కు మంచి స్పందన లభించిందని తెలిపారు. రొమాంటిక్ ప్రేమకథాంశంతో వైవిధ్యభరితంగా రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు కొత్తవాడైనా తీర్చిదిద్దాడని తెలిపారు. సూరి, నైనాల జంట ప్రేక్షకులకు కనువిందు కల్గిస్తుందని, సన్నివేశాలతోపాటు సినిమా పాటలు కూడా ప్రతి ఒక్కరికీ నచ్చుతాయని, రవిశంకర్ అందించిన సంగీతం వైవిధ్యంగా సాగి ఇప్పటికే మంచి స్పందన అందుకుందని అన్నారు. ఈ చిత్రానికి రచన, కెమెరా, దర్శకత్వం అగస్త్య మంజు అందిస్తుండడం విశేషం.