మావయ్య చరిష్మా తగ్గలేదు..సాయిధరమ్ తేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా ‘సుప్రీమ్’. ఫస్ట్ మూవీ ‘పటాస్’తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ఇది. ‘దిల్’రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా మే 5వ తేదీన విడుదలవుతుంది. 150వ చిత్రం ప్రారంభం సమయంలో మావయ్య చిరంజీవిని చూస్తే ఆయన చరిష్మా ఇంకా తగ్గలేదన్పించిందని అంటున్న సాయిధరమ్‌తేజ్ మీడియాతో అనేక విషయాలు ముచ్చటించారు.
‘సుప్రీమ్’ఎలా ఉంటుంది?
- మొదటిసారి పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాలో నటించాను. ‘రేయ్’ మ్యూజికల్ ఎంటర్‌టైనర్, ‘పిల్లానువ్వులేని జీవితం’, ‘లవ్‌బేస్డ్’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన సినిమాలు. ‘సుప్రీమ్’ పక్కా కమర్షియల్ మూవీ. ఫస్ట్ ఫ్రేమ్‌నుంచి లాస్ట్‌ఫ్రేమ్ వరకూ నవ్విస్తూ ఉంటుంది. అదే సమయంలో సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి.
మీ క్యారెక్టర్ గురించి చెప్పండి?
- క్యాబ్ డ్రైవర్ బాలు పాత్రలో నటించాను. ట్రెయిలర్‌లో చెప్పినట్టు వెనుకబడివారు హార్న్ కొడితే హారర్ సినిమా చూపించే రకం. దీనికి కారణాలు ఏంటో సినిమా చూసి తెలుసుకోవాలి. ఎక్కువ చెప్పేస్తే కథ తెలిసిపోతుంది.
‘గ్యాంగ్ లీడర్’ స్ఫూర్తిగా తీసుకున్నారా?
- లేదండీ. ఇప్పటికే ఉన్న కంపేరిజన్స్ చాలు. కొత్తవి వద్దు. కథానుగుణంగా క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించానంతే.
రీమిక్స్ సాంగ్ పెట్టాలనే ఐడియా ఎవరిది?
- దర్శకుడు అనిల్ రావిపూడిది. సినిమాకి ‘సుప్రీమ్’ టైటిల్ పెట్టిన తర్వాత ఆ సాంగ్ రీమిక్స్ చేయకపోతే ఎలా? అన్నాడు. క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా చాలా గ్రాండ్‌గా షూటింగ్ చేశాం. రీమిక్స్ పాటలకు నేను అనుకూలమూ కాదు, వ్యతిరేకం కాదు. దర్శక నిర్మాతలు రీమిక్స్ ప్రతిపాదనతో వస్తే నో అనను.
‘సుప్రీమ్’ టైటిల్ చిరంజీవిది కదా? ఆయన పాట కూడా రీమిక్స్ చేశారు. ఒత్తిడి ఫీలయ్యారా?
- ఒత్తిడి కాదు, బాధ్యత పెరిగింది. ఆడియోలో చెప్పినట్టు ‘సుప్రీమ్’ టైటిల్ చెప్పిన తర్వాత భయం వేసింది. చిరంజీవి మావయ్య దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాను. కష్టపడమని భుజం తట్టారు. ప్రతి సినిమాకి కష్టపడతాను. ఈ సినిమాకి 100శాతం కష్టపడి హిట్ చేయాలనే కసితో పనిచేశాం.
సినిమాలో మీకు నచ్చిన పాయింట్ ఏది?
- కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయినా అంతర్లీనంగా ఓ ఎమోషన్ క్యారీ అవుతుంది. అది నాకు బాగా నచ్చింది. రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. చిన్నపిల్లాడి క్యారెక్టర్ కూడా బాగుంటుంది.
అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్?
- సూపర్. క్లారిటీ ఉన్న దర్శకుడు. ఎక్కడైనా మనకు అలసట వస్తే ఎనర్జీ ఇస్తాడు. ఎమోషన్, కమర్షియల్ అంశాలను బాగా బాలన్స్ చేశాడు.
రాశీఖన్నా కమెడియన్ పాత్రలో కనిపిస్తుందని చెప్పారు?
- (నవ్వుతూ...) తన కామెడీ టైమింగ్ సూపర్ అసలు. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్లకు భిన్నమైన క్యారెక్టర్లో కనిపిస్తుంది.
ఫ్యామిలీ అందరూ చిరంజీవిగారి 150వ సినిమా ఓపెనింగ్‌కి హాజరయ్యారు. ఫీలింగ్ ఎలా ఉంది?
- సాధారణంగా నిర్మాత హీరోని తీసుకొస్తారు కదా. నిన్న ఓపెనింగ్‌లో చరణ్ చిరంజీవిని తీసుకురావడం బ్యూటిఫుల్ ఫీలింగ్. ఆయన అలా నడిచి వస్తుంటే ఇంకా చరిష్మా తగ్గలేదనిపించింది.

- యు