పరిగెడుతూనే ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో ఎప్పుడైనా సరే రేసులో
ఉండాలంటే -పరిగెడుతూనే ఉండాలి. మా నాన్న, విద్య చెప్పిన టీచర్,
సినీ మెంటార్ యన్టీఆర్‌లు నాకు
అదే నేర్పించారు. అదే పాటిస్తున్నా. లేదంటే -ఎప్పుడో ఇంటికెళ్లిపోయేవాణ్ని అంటున్నాడు నటుడు రాజేంద్రప్రసాద్.
రాజేంద్రప్రసాద్ లీడ్‌రోల్‌లో విశ్వనాథ్ మాగంటి తెరకెక్కిస్తోన్న సినిమా -తోలుబొమ్మలాట. మాగంటి దుర్గాప్రసాద్ నిర్మాత. సురేష్ బొబ్బిలి సంగీతం
సమకూరుస్తున్నాడు. 22న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడాడు రాజేంద్రుడు.
మనిషి జీవితమే తోలుబొమ్మలాట. ఇదీ పెద్దోళ్లు మనకు చెప్పారు. అలాంటి తోలున్న బొమ్మల్ని మాత్రం ఆ పైనున్నవాడే ఆడిస్తాడు. అది అమ్మ, నాన్న, గురువు, దైవం ఎవ్వరైనా కావొచ్చు ఇదీ నా నమ్మకం. జీవితం అనే ఆటలో ఆకస్మిక అంశాలు ఎదురైనపుడు ఎదుర్కోడానికి ఓ ప్రణాళిక ఉండాలి అన్న విషయాన్ని చెప్పేదే -మా తోలుబొమ్మలాట.
దర్శకుడు విశ్వనాథ్ మాగంటి చిన్న పిల్లాడు. కానీ లోతైన జీవితాన్ని కథగా మలిచి చెప్పినపుడు ఆశ్చర్యవేసింది. అంత చిన్న వయసులోనే చాలా జీవితం చూసినవాడిలా కథ రాశాడు. ఆ కథలో నా పాత్ర సోడాల రాజు. ఊళ్లో పెద్దమనిషి. దర్శకుడు రాసుకున్న క్యారెక్టరైజేషన్ నచ్చి ఓకే చెప్పా. రొటీన్ అనిపించకుండా -గౌరవం కలిగించేలా గెటప్ కోసం ప్రయత్నించి ఆ పాత్రకు కొత్త లుక్ ఇచ్చాం.
చిత్రమేంటంటే -సినిమా టెక్నికల్ టీం మొత్తం కుర్ర బ్యాచ్. కానీ కథ పట్ల అందరికీ విపరీతమైన మమకారం ఉంది. కథకు తగిన పనితనాన్ని కెమెరామెన్ చూపిస్తే, సంగీత దర్శకుడు ప్రాణం పెట్టేశాడు. ఆరంభంలో మ్యూజిక్ ట్రాక్ విన్నపుడే ఆశ్చర్యపోయా. కళ్లు మూసుకుని వింటే పల్లెటూరు కనిపించినంతగా బ్యాక్‌గ్రౌండ్స్ ఇచ్చాడు. 40 ఏళ్ల కెరీర్ తరువాత కూడా ఈ కథపట్ల ఇంత ఆసక్తి చూపిస్తున్నానంటే.. కారణం -సినిమా టీం.
మానవ సంబంధాల కారణంగా ఒక్కోసారి వత్తిళ్లు తప్పవు. అలాంటి వత్తిళ్ల నుంచి బయటపడటానికి ఏంచేయాలి? లాంటి జీవిత సత్యాలు ఈ కథలో చోటుచేసుకున్నాయి. హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్ ఎన్నున్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ బేస్‌మీదే కథ నడపటం మరో విశేషం.
నేను విన్న కథమేరకు -నా అనుభవాన్ని రంగరించి సోడాల రాజు పాత్రకు పూర్తి న్యాయం చేశాననే అనుకుంటున్నా. గెటప్ కూడా అద్భుతంగా కుదరడంతో -కథను నా శక్తిమేరకు మోశాననే భావిస్తున్నా. నేను పాత్ర చేస్తున్నానంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కనుక ఈ మాట చెబుతున్నా.
ఏ సినిమాలో ఏ పాత్ర చేయాల్సి వచ్చినా -అంత ఈజీగా తీసుకోను. కథవిన్న తరువాత నుంచే.. నా పాత్రమీద మథనం మొదలవుతుంది. ఇన్వాల్వ్ అవ్వడానికే ఎక్కువ కృషి చేస్తా. జీవితసారాన్ని చెప్పే ఇలాంటి కథల్లో పాత్ర చేయాల్సి వస్తే -ఆ కృషి కాస్త ఎక్కువుంటుందేమో.
నటుడిగా నా అనుభవానికి తగిన గౌరవం దక్కుతుండటం నా అదృష్టమనుకోవాలి. సీనియర్ ఆర్టిస్టుగా సెట్‌కి వెళ్లేసరికి -నానుంచి కొన్ని సలహాలు తీసుకోడానికి ప్రయత్నిస్తుంటారు. హ్యాపీ అనిపిస్తుంది. తోలుబొమ్మలాట చిత్రంలో వెనె్నల కిషోర్‌తో అలాంటి ప్రయాణమే సాగింది. మనకు తెలిసిన విషయాన్ని ఎవరైనా అడిగినపుడు చెబితే -మనలోని సామర్థ్యం మరింత పెరుగుతుందన్నది నా నమ్మకం.
మా అబ్బాయిని ఇండస్ట్రీకి ఎందుకు తీసుకురాలేదని చాలామంది అడుగుతుంటారు. ఎవరో తీసుకొచ్చినంత మాత్రాన -ఇండస్ట్రీలో ఎవ్వరూ నిలబడలేరు. మనలోని ఆసక్తి ఇటువైపు నడిపించాలి. అదృష్టంకొద్దీ ఆ ఆసక్తి నా మనవరాలికి వచ్చింది. ఆమె ఆసక్తికి తగిన ప్రోత్సాహం దక్కుతుండటం ఆనందంగా ఉంది.
‘మా’ అసోసియేషన్‌లో వివాదాలపై ఇప్పుడేం మాట్లాడలేను. కాకపోతే -ఆర్టిస్టుల సంఘం వీధికెక్కకుండా ఉంటే బావుండేది. వివాదాలకు కారణమేంటో పూర్తిగా నాకూ తెలీదు. కనుక్కోలేదు కూడా. సీనియర్‌గా ఒకవేళ నన్ను సహకారం అడిగితే, వివాదాల పరిష్కారానికి నావంతు ప్రయత్నం చేస్తానంతే.
పెద్ద స్టార్ల సినిమాలు చేస్తున్నాను కనుక -మరేం ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరులో మహేష్‌బాబుతో టామ్ అండ్ జెర్రీలాంటి పాత్ర చేస్తున్నా. అలాగే అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నా. జులాయిలో చేసిన పాత్రకు సీరియల్ అనుకోవచ్చుగానీ, క్యారెక్టరైజేషన్ వేరుగా ఉంటుంది. తరువాత ఎర్రచీర చేస్తా.