చావుని పండగ చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీం హీరో సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో జిఏ2, యువీ పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తోన్న చిత్రం -ప్రతిరోజూ పండగే. సత్యరాజ్, రావురమేష్, విజయకుమార్, మురళీశర్మ, అజయ్, గాయత్రి భార్గవి, హరితేజ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా థియేటర్లకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్‌కి మంచి ఆదరణ లభించింది. తాజాగా రెండో పాట ‘ఓ బావా..’ ప్రసాద్ లాబ్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ -మారుతి టైమింగ్, ఆ టైమింగ్‌ని తేజు బాగా పండించగలడన్న నమ్మకంతో సినిమా చేస్తున్నాం. హీరోయిన్ రాశిఖన్నా మాట్లాడుతూ -నా మీద నమ్మకంతో ఇంత మంచి పాత్ర ఇచ్చిన మారుతికి థాంక్స్. నా క్యారెక్టర్‌తో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ఇక ఓ బావ.. పాట తమన్ మంచి సంగీతాన్నిచ్చారు. నాకు ఇష్టమైన పాటల్లో ఇదొకటి అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ -అనుకోకుండా కుటుంబ కథా చిత్రం తీసుకున్నా. ఫ్యామిలీ సినిమా అనగానే గతంలో వచ్చిన కుటుంబ కథా చిత్రాలతో పోల్చడం పరిపాటి. అయితే ఇండియన్ స్క్రీన్‌మీద ఇంతవరకూ రాని పాయింట్‌తో సినిమా తెరకెక్కింది. ఎందుకంటే చాలా మంచి విషయాన్ని ఎంటర్‌టైన్ చేస్తూ చెప్పా. పుట్టినప్పుడు ఎలాగైతే సెలబ్రేషన్స్ చేస్తామో అలాగే ఒక వ్యక్తి చనిపోతున్నాడని తెలిసినపుడూ సంతోషంగా తనకు బెస్ట్ సెండాఫ్ ఇవ్వడమనేది మన బాధ్యత అనే పాయింట్‌ని అంతర్గతంగా చెబుతున్నా. సత్యరాజ్ నటన నాకే కన్నీళ్ళు తెప్పించాయి. మంచి కథ చేయడానికి అంగీకరించిన తేజు, రాశిలకు థాంక్స్ అన్నారు. హీరో సాయితేజ్ మాట్లాడుతూ -మా అందరిలో ఇంత ఎనర్జీకి కారణం తమన్. ఐదు పాటలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మారుతి కథ చెప్పగానే ఓకె చేశాను. నాతోపాటు సత్యరాజ్, రావురమేష్, విజయ్‌కుమార్, మురళీశర్మ, అజయ్.. ఇలా ప్రతి క్యారెక్టర్‌కీ ఇంపార్టెన్స్ వుంటుంది. రాశి క్యారెక్టర్ ప్రజెంట్ టిక్‌టాక్ ట్రెండ్ నుంచి తీసుకున్నాం. తన ఏంజెల్లా పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది అన్నారు. కార్యక్రమంలో సత్యరాజ్, విజయకుమార్, రావురమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్యశ్రీనివాస్, గాయత్రి భార్గవి, హరితేజ తదితరులు పాల్గొన్నారు.