రజనీ.. పర్ఫెక్ట్ స్కెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం దర్బార్ సంక్రాంతి రేస్‌నుంచి ముందుకు జరిగింది. జనవరి 15న సినిమా విడుదలకు సన్నాహాలు చేసినా, తాజా అప్‌డేట్‌లో జనవరి 9నే థియేటర్లకు వస్తున్నట్టు సమాచారం. జనవరి 12న పెద్ద చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం చిత్రాలు విడుదలవుతున్నాయ. ఈ నేపథ్యంలో 15న దర్బార్ వస్తే కలెక్షన్లు దెబ్బతినే ప్రమాదముందని ఆలోచించిన చిత్రబృందం.. జనవరి 9నే ప్రేక్షకులముందుకు తెస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించుకుంది. 9న సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అనేక థియేటర్‌లలో విడుదల కానుండటంతో మూడు రోజులపాటు సోలో కలెక్షన్లు దర్బార్‌కు అందనున్నాయి. మురుగదాస్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, నివేదా థామస్ మరో వైవిధ్యమైన పాత్రలో నటించింది. కెమెరాను సంతోష్ శివన్, సంగీతాన్ని అనిరుధ్ అందించారు. రజనీకాంత్‌తో ఏ.ఆర్.మురుగదాస్ రూపొందించిన దర్బార్ చిత్రంపై ఇప్పటికే అంచనాలు టాప్ పొజిషన్‌లో వున్నాయి. క్రేజీ కాంబినేషన్ అవ్వడంతో నిర్మాత భాస్కరన్ కూడా ఈ చిత్రాన్ని ప్రెస్టేజియస్‌గా తీసుకొని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. పవర్‌ఫుల్ పోలీసు అధికారికా రజనీకాంత్ నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హైటెక్నికల్ విలువలతో అన్ని రకాల కమర్షియల్ హంగులతో తీర్చిదిద్దాడు మురుగదాస్. ఇప్పటికే విడుదలైన సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని యూనిట్ ప్రకటించింది. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ దర్బార్ చిత్రాన్ని రూపొందించడం తనకొక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌లా వుందని, రజనీ డబ్బింగ్ చెప్పేటప్పుడు మెమరబుల్ మూమెంట్స్ ఎన్నో వున్నాయని అన్నారు. కనుక సంక్రాంతికి ముందుగా వచ్చే పోటీ చిత్రం దర్బార్ అని తేలిపోయింది.