డిగ్రీ కాలేజీలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్, దివ్యారావు జంటగా వస్తున్న ‘డిగ్రీ కాలేజ్’ చిత్రంనుంచి రెండో ట్రైలర్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ- యధార్థ సంఘటనలతో రూపొందిన ఈ చిత్రం ఇద్దరు వ్యక్తుల బయోపిక్‌గా వుంటుందన్నారు. కాలేజీలో ఓ ప్రేమజంట ఎలా ప్రవర్తిస్తుదన్న అంశాన్ని తీసుకొని వల్గారిటీకి తావులేకుండా రూపొందించామన్నారు. కమర్షియల్‌గా యూత్‌కోసమే తీశామని, ఇది యధార్ధ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమని సహ నిర్మాత తెలిపారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన సినిమా యువతను చెడగొట్టేలా వుండదని, అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుందన్నారు. డిసెంబర్ రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని హీరో వరుణ్ తెలిపారు. కార్యక్రమంలో సహ నిర్మాతలు, నటీనటులు, చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు.