ఆసక్తికరం.. సూసైడ్ క్లబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవీణ యండమూరి, సాంకేత్, వెంకటకృష్ణ, చందన, శివ రామచంద్రవరపు ప్రధాన తారాగణంగా 3ఐ ఫిలింస్ సమర్పణలో రూపొందిస్తున్న చిత్రం ‘సూసైడ్ క్లబ్’. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వంలో ప్రవీణ్ ప్రభు వెంకటేశన్, 3ఐ ఫిలింస్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ట్రైల్ షోను నిర్వహించారు. అనంతరం దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ- తాను జీవితంలో చూసిన అనేక యధార్థ సంఘటనలను ఆధారం చేసుకొని సినిమాటిక్‌గా రాసుకున్న కథనే ఈ చిత్రమని తెలిపారు. కంప్లీట్‌గా స్క్రీన్‌ప్లే బేస్డ్ కథనంగా రూపొందిన ఈ చిత్రంలో శివ అద్భుతంగా టైలర్‌మేడ్ పాత్రలా నటించారని అన్నారు. అలాగే వెంకట్ నటించిన పాత్ర కూడా యూనిక్‌గా వుంటుందని, దాదాపు 80 మందిలో చందన ఒక్కతే అమ్మాయిగా ఈ చిత్రంలో నటించిందని, పాటలన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయని, త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించామని, అందులో కూడా డబ్బింగ్ తానే చెప్పానని హీరో శివ అన్నారు. పక్కా స్క్రీన్‌ప్లే బేస్డ్ కథనంతో ఒక్కసారి వింటేనే ఈ కథను ఎవరైనా ఇష్టపడతారని, దర్శకుడు కూడా పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడన్నారు. కొత్తవారితో చేసిన ఈ ప్రయోగం అందరికీ నచ్చుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వెంకట్, ప్రవీణ్ యండమూరి, చందన తదితరులు మాట్లాడారు.