సుక్కూ స్కీమేంటో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగస్థలంతో సెనే్సషన్ హిట్టుకొట్టాడు దర్శకుడు సుకుమార్. కథానాయకుడికి వినికిడి లోపంపెట్టి సింపతీని పండించటమేకాదు, పోష్ హీరోని పల్లెటూరి కుర్రాడిగా చూపించి ఆడియన్స్‌కి బలంగా కనెక్ట్ చేశాడు. అలా రంగస్థలంలో ఓ తరహా ప్రయోగాన్ని సక్సెస్ చేసిన సుక్కూ -ఇప్పుడు అల్లు అర్జున్‌తో మరో ప్రయోగానికీ తెరలేపుతున్నాడన్నది తాజా సమాచారం. అల్లు అర్జున్ -రష్మిక జోడీగా కొత్త ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నాడు సుకుమార్. చిత్తూరు అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంగా నడిచే కథను సిద్ధం చేసుకున్న సుక్కూ -దుంగల దందాలో లారీ డ్రైవర్‌గా బన్నీని చూపించనున్నాడట. ‘నా పేరు సూర్య..’లో పర్ఫెక్ట్ సోల్జర్‌గా కనిపించిన బన్నీ.. అందుకు భిన్నంగా చందన దుంగల్ని అక్రమ రవాణా చేసే లారీ డైవర్‌గా కనిపించనున్నాడన్నది ఆసక్తిని పెంచుతోంది. స్మగ్లర్‌గా రా అండ్ రఫ్ లుక్‌లో కథానాయకుడిని చూపిస్తూ.. స్మగ్లింగ్ దందాలో కూలీగా రష్మిక మందన్న పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. రంగస్థలంలో చరణ్ -సమంతలను డీగ్లామర్‌గా చూపిస్తూనే అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ చేయించిన సుక్కూ -అదే స్కీంని బన్నీ ప్రాజెక్టులోనూ మరింత వైవిధ్యంగా వర్కౌట్ చేసి ఉండొచ్చన్న అంచనాలు లేకపోలేదు. అయితే, రష్మిక ఫారెస్ట్ ఆఫీసర్‌గా కనిపించే అవకాశముందన్న వాదనా వినిపిస్తోంది. ఏదేమైనా సినిమా సెట్స్‌పైకి వెళ్లి అధికారిక అప్‌డేట్స్ అందాలంటే కొంతకాలం ఎదురు చూడక తప్పదు.