వెజిటేరినయన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుళ్లు, పురాణ పురుషుల పాత్రలు పోషించే సమయంలో -కొన్ని సంప్రదాయ నియమాలు ఆచరించటమనే సంస్కారం స్వర్ణయుగంనాటి నటుల్లో ఎక్కువ కనిపించేది. అందులోనూ -చిత్రసీమలో అవతార పురుషుల పాత్రలు ఎక్కువ పోషించిన యన్టీ రామారావైతే.. ఆ నియమాలను మరింత కఠినంగా అనుసరించేవారన్నది అనేక సందర్భాల్లో విన్నమాట. అంతేకాదు, ఆ పాత్రకు దగ్గరగావున్న పాత్రధారులూ నియమ నిబద్ధతతో ఉండాలని ఆశించేవారాయన. అలాంటి సందర్భాలను చర్చించుకునే అవకాశం ఇటీవలి కాలంలో చాలాచాలా తక్కువ.
తాజాగా అలాంటి నియమాన్ని దక్షిణాది అగ్రనటి నయనతార అనుసరిస్తోందట. కొన్ని విషయాల్లో నయన్ నిర్ణయాలు ఓ పట్టాన అంతుబట్టవు. ఎంత గొప్ప సినిమాకైనా ప్రమోషన్స్‌కు కాలు కదపనన్నది ఆమె నియమం. స్టార్ హీరోల సినిమాలే అయినా.. చివరకు ఆమె పంతమే నెగ్గుతుంది. తాజాగా తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘ముక్తిఅమ్మన్’ సినిమాలో నయన్ దేవత కన్యాకుమారి పాత్ర పోషిస్తోంది. ఈ పాత్ర షూటింగ్ పూర్తయ్యేవరకూ మాంసాహారం ముట్టకూడదన్న నియమం పెట్టుకుందట నయన్. గతంలో శ్రీరామరాజ్యంలో సీత పాత్ర పోషించిన సమయంలోనూ.. షూటింగ్ పూర్తయ్యే వరకూ నయన్ నాన్‌వెజ్ ముట్టలేదు. నయన్ క్రిస్టియన్ అయినా.. దేవతామూర్తుల సినిమాలు చేసే టైంలో నియమానుసారానికి సిద్ధపడటం సంప్రదాయంపై ఆమెకున్న గౌరవాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రస్తుతం రజకీకాంత్‌కు జోడీగా దర్బార్ చిత్రం చేస్తోన్న నయన్ -సంక్రాంతి సీజన్‌లో ఆడియన్స్ ముందుకు రానుంది.