లార్జ్ పెగ్ దేన్ లైఫ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందుకొట్టడం కొందరికి సరదా, ఇంకొందరికి వ్యసనం. కానీ -ఈ దేవదాస్‌కి అవసరం. కార్తికేయ హీరోగా వస్తున్న 90ఎంఎల్ సినిమాకు ఇదీ సంక్షిప్తరూపం. రెండు పంక్తుల్లో రెండు గంటల సినిమాను చెప్పేస్తూ -90ఎంఎల్ చిత్రబృందం తాజాగా ట్రైలర్ వదిలింది. ఆర్‌ఎక్స్ 100తో ఒకతరహా పాత్రలకు కార్తికేయ ఆప్ట్ అనిపించుకున్నాడు. అలాంటి షేడ్స్‌తో మరోసారి మెప్పించేందుకు -90ఎంఎల్‌తో వస్తున్నాడు. నేహాసోలంకి ఫిమేల్ లీడ్‌రోల్ చేస్తోంది. దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కించిన చిత్రం డిసెంబర్ 5న థియేటర్లకు రానుంది. సోషల్ మీడియా వేదికగా గురువారం విడుదల చేసిన ట్రైలర్ కంటెంట్ -సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ‘నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది. నాతో కలిసి బతకాలనే ఆలోచనే నీకు లేదు’ అంటూ హీరోతో హీరోయిన్ చెప్పే ఎమోషనల్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఆరోగ్య పరిస్థితులరీత్యా మందు కొట్టడం అనివార్యమైన కండిషన్‌లో కథనాయకుడి పాత్రను పరిచయం చేశారు. అనివార్యంగా తాగే ‘90ఎంఎల్’ కోటా అతని జీవితంలో ఎలాంటి పరిస్థితులకు కారణమైందన్న కానె్సప్ట్‌ను వైవిధ్యంగా చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ‘ఏం.. ఒక్క రోజు తాగకపోతే చస్తావా’ అంటూ క్రైసిస్ సిట్యుయేషన్‌లో నాయిక అడిగిన ప్రశ్నకు -‘ఔను, చచ్చిపోతాను’ అంటూ కథానాయకుడి ఎమోషనల్ డైలాగ్‌మీద ట్రైలర్‌ను ముగించటం బావుంది. క్లుప్తంగా చెప్పాలంటే -‘ఆ దేవదాసు తాగి చచ్చిపోయాడు. ఈ దేవదాసు తాగకపోతే చస్తాడు’ అన్న కానె్సప్ట్‌పై దర్శకుడు సినిమా నడిపినట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. 90ఎంఎల్ కంటెంట్ ఆడియన్స్‌కి ఎంత కిక్కిస్తుందన్నది డిసెంబర్ 5న తెలుస్తుంది.