క్యూ.. కట్టేశారు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద సినిమాల విడుదల మధ్య గ్యాప్ వస్తే -చిన్న నిర్మాతలకు పండగే. ఎప్పుడో సినిమా పూర్తయినా.. విడుదల ముహూర్తం ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసేవాళ్లే ఎక్కువ. పెద్ద సినిమాల అడ్డులేని టైం దొరికినపుడు -బాక్సాఫీస్ దగ్గర క్యూ కట్టడానికి చిన్న నిర్మాతలు ఎగబడటం అప్పుడప్పుడూ టాలీవుడ్‌లో కనిపించేదే. మరీ ముఖ్యంగా సినిమా సీజన్‌కు ముందో వెనుకో ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈకోణంలో ఈ శుక్రవారం ఏకాఎకిన ఏడు సినిమాలు థియేటర్లవద్ద తన సుడిని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వీటిలో స్ట్రెయిట్ సిత్రాలు కొన్నైతే.. అనువాద చిత్రాలు మరికొన్ని. డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లలో సినిమాలున్నా.. దేనికదే స్పెషల్ అన్నట్టు ఆయా చిత్రబృందాలు ప్రచారం చేసుకున్నాయి. ఒక్కసారిగా ఇన్ని సినిమాలు రావడం ప్రత్యేకమే అయినా.. ఆడియన్స్ తమ బడ్జెట్‌నుబట్టి నచ్చిన సినిమాను ఎంచుకోవడం పరిపాటి. సో, బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడిన సినిమా ఏమిటన్నది ఒక్కరోజులోనే తేలిపోతుంది. ఆయా సినిమాలను ఒక్కసారి చూద్దాం.
ఈషా రెబ్బ, సత్యదేవ్ జోడీగా దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ -రాగల 24 గంటల్లో. ఆసక్తికరమైన టైటిల్‌తో మర్డర్ మిస్టరీ చుట్టూ సాగే కథ ఇది. రాహుల్, విద్య దంపతులు. అనూహ్య పరిస్థితుల్లో రాహుల్ హత్యకు గురవుతాడు. ఆ హత్య నేనే చేశానంటుంది విద్య. ఆమె నిజంగానే భర్తను హత్యచేసిందా? హంతకులు మరెవరైనానా? అసలు హత్యకు కారణాలేంటి? ఏసీపీ నరసింహా ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు? లాంటి ప్రశ్నలకు సమాధానంగా కథ నడుస్తుందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే ఆడియన్స్‌ని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
1970ల నాటి ఉస్మానియా వర్శిటీ క్యాంపస్ లైఫ్‌ని స్టూడెంట్ లీడర్ కోణంలో చూపించే సినిమా జార్జిరెడ్డి. సందీప్ మాధవ్, సత్యదేవ్ లీడ్ రోల్స్‌తో దళం ఫేమ్ దర్శకుడు జీవన్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. సినిమాటిక్ లిబర్టీస్‌తో జార్జ్‌రెడ్డి లైఫ్‌ని చూపించే ప్రయత్నం చేశామన్నది చిత్రబృందం చెప్తోన్న మాట. టైటిల్‌తోనే ఓ రేంజ్ అంచనాలు ఏర్పడితే, టాప్ సెలబ్రిటీల బైట్స్‌తో సినిమాకు స్పెషల్ ఫోకస్ వచ్చింది. ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడలిస్ట్ సాధించిన ఉస్మానియా స్టూడెంట్ జార్జిరెడ్డి, క్యాంపస్‌లోని అన్యాయాలు, అణచివేతపై సలిపిన పోరాట ఘట్టం ప్రధాన ఇతివృత్తమన్నది తెలుస్తోంది. తెలుగులో బయోపిక్‌లకు విజయావకాశాలు తక్కువ. కాకపోతే, జార్జిరెడ్డికి ప్రత్యేక ఇమేజ్ ఉంది కనుక.. ఆ కోణం ఆడియన్స్‌కి కనెక్టయితే సినిమాకు మంచి టాక్ రావొచ్చు.
‘మనిషి బతుకే బొమ్మలాట’ థీమ్‌తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ -తొలుబొమ్మలాట. సోడాల రాజుగా రాజేంద్రప్రసాద్‌ను లీడ్ రోల్‌లో చూపిస్తూ దర్శకుడు విశ్వనాథ్ మాగంటి తెరకెక్కించిన చిత్రం. కుటుంబ కథా చిత్రానికి తగిన ప్రమోషన్స్ నిర్వహించి ఆడియన్స్ దగ్గరకైతే సినిమాను తీసుకెళ్లారు. కంటెంట్‌పరంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతబలంగా కనెక్ట్ చేయగలదన్న అంశంపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది. బతుకు ప్రయాణంలో ప్రతిబంధకాలు ఎదురైనపుడు వాటిని అధిగమించగలిగే ఆప్షన్ ఏమిటన్నది? సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీటితోపాటు మహేందర్ ఇప్పలపల్లి, కాత్యాయనిశర్మ జోడీగా వస్తోన్న థ్రిల్లర్ -ట్రాప్; చేతన్ మద్దినేని, తేజరెడ్డి జోడీగా చేసిన సోషియో థ్రిల్లర్ -బీచ్ రోడ్ చేతన్; క్రాంతి, కె సీమర్ లీడ్‌రోల్స్‌లో దర్శకుడు హేమంత్ శ్రీనివాస్ తెరకెక్కించిన -పిచ్చోడు సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. ఇక పెద్ద ఆర్టిస్టుల అనువాద చిత్రాలు రెండు -స్ట్రెయిట్ చిన్న సినిమాలతో పోటీ పడుతున్నాయి. మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన రాజా నరసింహ తెలుగులో విడుదలవుతోంది. భారీ కమర్షియల్ వాల్యూస్‌తో తెరకెక్కిన మలయాళ సినిమా ఇప్పటికే అక్కడ రికార్డులు బద్దలుకొట్టింది. ‘మన్యంపులి’తో సక్సెస్ అందుకున్న వైశాఖ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం మరో ప్లస్ పాయింట్. మమ్ముట్టి చిత్రాలపై టాలీవుడ్ ఆడియన్స్‌కి ఆసక్తివున్నా, ఈ సినిమాకు ఎలా కనెక్టవుతారన్నది చూడాలి.
ఇక జ్యోతికను లీడ్‌రోల్‌లో పెట్టి తమిళ టాప్ హీరో సూర్య నిర్మించిన సినిమా -జాక్‌పాట్. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన సినిమా ఇది. చాలాకాలం తరువాత జ్యోతిక స్క్రీన్‌మీద కనిపిస్తోందన్నది ఈ సినిమాకు ప్లస్ పాయింట్. తమిళంలో హిట్టయినా, తెలుగు వర్షన్‌పై పెద్ద బజ్ లేదు. జ్యోతిక ఇమేజ్‌తో ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందన్నది చూడాలి.