విజయ్ ఆంటోనీ.. జ్వాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సలీం సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌కి విజయ్ ఆంటోనీ పరిచయమైనా -బిచ్చగాడు చిత్రంతో బాగా దగ్గరైపోయాడు. వైవిధ్యమైన కథ కథానాలతో వచ్చిన ఆ సినిమా తెలుగులో విజయ్‌కి ఒకింత ఇమేజ్ క్రియేట్ చేసంది. ఆ తరువాతా.. విజయ్ ఆంటోనీ వైవిధ్యమైన కథలతోనే వచ్చినా అవేవీ బిచ్చగాడు స్థాయిలో మెప్పించలేదు. మరోసారి అలాంటి వైవిధ్యమైన కథతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు విజయ్ ఆంటోనీ. తమిళంలో దర్శకుడు నవీన్ తెరకెక్కిస్తోన్న ‘అగ్ని సిరగుగుల్’ సినిమా తెలుగు వర్షన్‌కు ‘జ్వాల’ టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విజయ్ ఆంటోనీ పోషిస్తోన్న శీను పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ సైతం వదిలారు. విజయ్ ఆంటోనీతో అక్షరహాసన్ జోడీకట్టింది. ‘ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్. ఆడియన్స్‌కి విజువల్ ఫీస్ట్. రష్యా, మాస్కో, కజకిస్తాన్ ప్రాంతాల్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో సినిమా తెరకెక్కించాం. యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్. ఈ సినిమాతో భారీ విజయం అందుకుంటామన్న నమ్మకంతో ఉన్నాం’ అంటున్నాడు దర్శకడు కల్యాణ్.