మహాభారతం నా చివరి సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిశ్రమలో దాసరి నారాయణరావుకు ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడికి స్టార్ ఇమేజ్‌ని తీసుకువచ్చింది ఆయనే. దర్శకుడిగానే కాక నటుడు, రచయిత, నిర్మాత, పంపిణీదారుడు- ఇలా పలు రంగాల్లో తనదైన ఇమేజ్‌ను సృష్టించుకున్న దాసరి ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు పెద్దదిక్కులా మారారు. 1972లో ‘తాతా-మనవడు’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన సుమారుగా 150 చిత్రాలకు దర్శకత్వం వహించి పలు చిత్రాల్ని నిర్మించారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఇంటర్వ్యూ..
పవన్‌తో సినిమా అన్నారు, ఎప్పుడు?
- త్వరలోనే పవన్‌తో సినిమా మొదలుపెట్టనున్నా. ఇప్పటికే కథ కూడా సిద్ధంగా ఉంది. త్రివిక్రమ్ కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు. అయితే దర్శకుడు ఎవరనేది మాత్రం సస్పెన్స్. అదీకాకుండా మరో మూడు సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నా. అందరూ కొత్తవాళ్ళతో నా దర్శకత్వంలో ఓ పూర్తి స్థాయి ప్రేమకథతో సినిమా చేస్తున్నాను.
ప్రస్తుతం ప్రేమకథా చిత్రాల ట్రెండ్ మారింది కదా?
- ప్రేమకథల్లో ట్రెండ్ మారినా కూడా మారనవి రెండు ఉంటాయి. ఒకటి ప్రేమ, రెండు ఫీలింగ్. ఈ రోజుల్లో ప్రేమ అంటే కామంగా మారిపోయింది. అందమైన అమ్మాయి కనిపించగానే ఐ లవ్ యు చెప్పే ప్రేమకథలు నేను చేయను. యూత్‌కు బాగా దగ్గరగా వున్న కథతో ప్రతీ అమ్మాయి అబ్బాయి కనెక్ట్ అయ్యేలా తీస్తా. నిజానికి ఈ కథ ఎప్పుడో రాసుకుంది. అప్పట్లో రామానాయుడుతో తీద్దామనుకున్నాను, కుదరలేదు.
ఈమధ్య సినిమాలకి దూరంగా వుండడానికి కారణం?
- సినిమాల్లో నటించడానికి దూరంగా లేను కానీ కొంత గ్యాప్ తీసుకున్నాను. అయితే నేను చేసిన రెండు సినిమాలు ‘పరమవీరచక్ర’, ‘ఎర్రబస్సు’ చిత్రాలు నిరాశపరచడంతో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
మీరు చేస్తున్న మహాభారతం సినిమా గురించి?
- మహాభారతాన్ని ఐదు భాగాలుగా తీయాలన్నది నా ప్లాను. ఇప్పటికే రెండు భాగాలు పూర్తయ్యాయి. మూడో పార్ట్ సిద్ధం చేస్తున్నాను. మహాభారతం సినిమాను ఎవరు తీసినా నేను మాత్రం తీయకుండా ఉండను. దర్శకుడిగా నేను చేసే చివరి చిత్రం అదే.
ప్రస్తుతం భిన్నమైన సినిమాలు వస్తున్నాయి కదా?
- అవును. ప్రస్తుతం ప్రేక్షకుల ధోరణి మారింది. ఒకప్పుడు ప్రేమ పేరుతో వెకిలి చేష్టలు చేయడం, తల్లిదండ్రులను తిట్టడం, మాస్టార్లను ఏడిపించడం లాంటి చిత్రాలు చూడ్డం మానేశారు. ‘కల్యాణవైభోగమే’, ‘క్షణం’, ‘ఊపిరి’ వంటి సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతున్నాయి.
ఈమధ్య భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఫ్లాప్ అయితే రెమ్యూనరేషన్ రిటర్న్ ఇచ్చేయమంటున్నారు కదా, దీని గురించి?
- సినిమాలు సరిగ్గా ఆడకపోతే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేయడం సరికాదు. సినిమా నష్టపోతే డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థతో మాట్లాడాలి. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు పిలిచి సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చేవాళ్లు. బయ్యర్స్ నష్టపోతే హీరోలు చేయబోయే తదుపరి చిత్రంలో కనె్సషన్ ఇచ్చేవారు. ఈ పద్ధతి ఎప్పటినుంచో వుంది. హీరో క్రేజ్‌ను బట్టి ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి కొనుక్కుంటారు. అలాంటప్పుడు సినిమా లాస్ అయితే దర్శక నిర్మాతలు, హీరోలు ఏమీ చేయనక్కరలేదు. అయితే, ఇలాంటి నష్టం ఎక్కువగా వుంటే దర్శక నిర్మాతలు కొంతవరకూ ఆ నష్టాన్ని పూడ్చడం కరెక్టే.
చిన్న సినిమాలకు ఐదో షో గురించి?
- చిన్న చిత్రాలకు థియేటర్ల సమస్య బాగా ఉంది. అందుకే నాలుగు ఆటలు కాకుండా ఐదు ఆటలు వుండేలా మార్చడానికి ప్రతిపాదనలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రయత్నం ప్రభుత్వం దగ్గర వుంది. చిన్న ఊర్లల్లో వున్న థియేటర్లలో కూడా ఆన్‌లైన్ ప్రాసెస్ రావాలి. అప్పుడే చిన్న సినిమాలకు మంచి రోజులొస్తాయి.
హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి కదా?
- హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మార్చాలి. దీనికోసం తమిళ, కన్నడ, బాలీవుడ్‌తోపాటు నార్త్ ఇండస్ట్రీ కూడా ఇక్కడికి రావాలి. దాదాపు రెండు వేల ఎకరాల్లో ఓ సంపూర్ణ వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికోసం ఖచ్చితంగా ప్రభుత్వంతో సహకరిస్తాం.
రాజకీయాల గురించి?
- నేను వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి పార్టీలో చేరతానని వార్తలొస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కూడా నాకు లేదు. ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. నాలా సూటిగా వుండేవారు రాజకీయాలకు అస్సలు పనికిరారు. పైగా బురద చల్లించుకొనిరావాలి.
ప్రస్తుతం సక్సెస్ రేటు తగ్గింది, దానికి కారణం?
- సినిమా సక్సెస్ రేటు తగ్గడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా అనుభవం లేని నిర్మాతలు సినిమాలు తీయడం. అప్పట్లో నిర్మాతకు ప్రతీఒక్కదానిపై అవకాహన వుండేది. కానీ ఇప్పుడు కొందరు నిర్మాతలకు స్క్రిప్ట్ అంటే ఏంటో కూడా తెలియదు. పైగా కథలతో కాకుండా కాంబినేషన్ల కోసం సినిమాలు చేస్తే కూడా కష్టమే.
చానల్ పెడుతున్నారనే వార్తలొస్తున్నాయి?
- వార్తాపత్రిక, చానల్ పెట్టాలనే ఆలోచన అయితే వుంది కానీ, అలాంటి మనుషులెవరున్నారా అని ఆలోచిస్తున్నాను.

-శ్రీ