అప్పటివరకూ.. నిశ్శబ్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసక్తి రేకెత్తిస్తోన్న అనుష్క తాజా చిత్రం -నిశ్శబ్ధం. దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. పోస్ట్ ప్రొడక్షన్స్‌లోవున్న సినిమాను జనవరి 31న థియేటర్లకు తేనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా మీట్‌లో నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ -హేమంత్ చెప్పిన కథ బాగా నచ్చింది. మేం నమ్మిన కథను ముందుకు తీసుకెళ్లేందుకు మాకు పీపుల్స్ మీడియా అండగా నిలిచింది. ఫుల్‌లెంగ్త్ మూవీ అమెరికాలో షూట్ చేయడం బహుశే ఇదే మొదటిసారి. టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అనుకోని విధంగా ఫ్లైట్ జర్నీలో అనుష్కకు చెప్పిన కథ ఇది. సినిమా నిర్మాణంలో వివేక్ కూచిభొట్ల సహకారం మర్చిపోలేం. గోపీసుందర్ సంగీతం, టెక్నీషియన్ల పనితనం సినిమాకు ప్లస్. సినిమాలో హీరో హీరోయిన్లంటూ ఉండరు. అనుష్క, అంజలి, మాధవన్, షాలిని ఇలా ఎవరి పాత్ర వాళ్లదే అన్నాడు. నటుడు సుబ్బరాజు మాట్లాడుతూ -పాటలు బాగున్నాయి. ఆర్టిస్టులంతా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నాడు. సీనియర్ ఆర్టిస్టులతో నటించే అవకాశం దక్కడం నా అదష్టం అని నటి వందన పేర్కొంది. విశ్వప్రసాద్ మాట్లాడుతూ హాలీవుడ్ రేంజ్‌లో తెలుగు సినిమా తీయాలన్న నా కల నిశ్శబ్ధంతో నెరవేరింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో -విడుదలపై ఆడియన్స్‌లో ఆసక్తివుంది. డిజార్డర్‌వున్న ఆర్ట్ లవర్‌గా అనుష్క కనిపించనుంటే, సెలో ప్లేయర్‌గా కీలక రోల్ పోషిస్తోన్న మాధవన్‌తో ఆమె రిలేషన్‌పైనా ఆసక్తివుంది. హారర్ ఎఫెక్ట్స్‌తో పాత్రల్ని పరిచయం చేయడం, హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడిసన్ డిటెక్టివ్ కెప్టెన్ రోల్ పోషిస్తుండటం.. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రచయిత కోన వెంకట్ తన సొంత బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్నాడు.