సరికొత్తగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్ -మంచి నటుడు. తరువాత నిర్మాత. వీటికిముందు వ్యాపారి. సక్సెస్‌ఫుల్ జర్నీలో స్టార్ రేంజ్ అందుకోకున్నా -వైవిధ్యాన్ని మాత్రం ఆపాదించుకున్నాడు. మొన్న ‘నినువీడని నీడను నేనే’.. నిన్న ‘తెనాలి రామకృష్ణ’.. సినిమాలతో వైవిధ్యాన్ని చూపించిన సందీప్ -కమర్షియల్ సక్సెస్‌లు అందుకున్నాడనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ జంట నగరాల్లో రెస్టారెంట్లను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తూ.. మరో కొత్త వ్యాపారంలోకీ అడుగుపెట్టాడట. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ భిన్నమైన పాత్రలు పోషిస్తోన్న సందీప్ -తాజాగా ఆంధ్ర రాజధాని అమరావతిలో ‘స్టైలిష్ సెలూన్’కు శ్రీకారం చుట్టడం విశేషం. క్యూబిఎస్ ప్రాంఛైజీని అందుకున్న సందీప్ -రియల్ లైఫ్‌లోనూ తనదైన ట్రెండ్ చూపిస్తున్నాడనే చెప్పాలి. ప్రస్తుతానికి హాకీ నేపథ్యంలో ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు చేస్తోన్న సందీప్ -యంగ్ హీరోలకు ఆదర్శం అనుకోవచ్చు.