భావోద్వేగ బంధమిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకీమామతో అల్లుడిని ఆల్‌రౌండర్‌గా చూస్తారు. భావోద్వేగ సన్నివేశాలను అద్భుతంగా పండించాడు. నా కుటుంబంలోని హీరో, మేనల్లుడితో కలిసి సినిమా చేయడం సంతోషమే కాదు, వైవిధ్యమైన అనుభవం కూడా -అన్నారు హీరో వెంకటేష్. మామా అల్లుళ్ల కథను సెన్సిబుల్‌గా స్టోరీగా తీర్చిదిద్దిన దర్శకుడు బాబి ప్రతిభన ప్రశంసించారు. వెంకటేష్ -నాగచైతన్య కాంబోలో వస్తోన్న మల్టీస్టారర్ -వెంకీమామ. రాశిఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లు. డిసెంబర్ 13న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్రబృందం మీడియా మీట్ నిర్వహించింది. సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ -నా కెరీర్‌లో ఈ సినిమా ఓ స్పెషల్. నా కుటుంబం నుంచి హీరోలైన రానా, చైతన్యలతో కలిసి పని చేయాలని అనుకునేవాడిని. నా తండ్రి రామానాయుడూ.. కుటుంబంతో కలిసి సినిమా చేయాలని ఆలోచిస్తుండేవారు. రియల్ లైఫ్ రిలేషన్ పాత్రల మధ్య ప్రతిబింబిస్తూ చైతూతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. సినిమాలో ప్రతి సీక్వెన్సూ హైలెట్. వెంకీమామ చిత్రం దర్శకుడు బాబికి ఓ బెస్ట్ మూవీ అన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ -ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలన్నీ నాకు ముఖ్యమైనవే అయినా.. ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గవి మాత్రం మనం, వెంకీమామ. ఆ సినిమాలతో నా అనుభవం, జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోయేది కాదు. నిజంగానే వెంకీ మామతో పని చేయడం ఉద్వేగభరితంగా ఫీలయ్యా. సీనియర్‌తో జర్నీలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను కూడా. సినిమాలోని మిలటరీ సన్నివేశంలో దర్శకుడు నన్ను ప్రజెంట్ చేసిన విధానం ఓ కొత్త అనుభూతి అన్నారు. దర్శకుడు బాబి మాట్లాడుతూ -ఉగాది పచ్చడిలోని షడ్రుచులకు సంకేతం వెంకీమామ. అల్లుడి పాత్రతో ట్రావెల్ చేస్తున్నపుడు మేనమామ, మామ పాత్రకు కనెక్టైవున్నపుడు మేనళ్లుళ్లు గుర్తుకు రావడం ఖాయం. భావోద్వేగాల రుచి చూపించే ఫ్యామిలీ ఎంటర్‌టైనరే కాదు, రిస్కీ లొకేషన్స్‌లో హీరోలు చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా. ఆడియన్స్‌కి తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నా అన్నారు. నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ -తర్జనభర్జనల తరువాత డిసెంబర్ 13నే రావాలని నిర్ణయించాం. మానవ సంబంధాలకు పెద్దపీట వేస్తూ.. అద్భుతమైన సీక్వెన్స్‌లతో దర్శకుడు అల్లుకున్న మంచి కథ ఇది. ప్రేమ, త్యాగం, భావోద్వేగం, ఆప్యాయతానుబంధాల మేళవింపుగా సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వెంకీమామను అభివర్ణించారు. రాజమండ్రి, హైదరాబాద్, కాశ్మీర్‌లో షూట్ చేసిన అనుభవాలు మర్చిపోలేమని అంటూ, కాశ్మీర్ రిస్కీ లొకేషన్స్‌లో షూట్ చేస్తున్నపుడు భారత ఆర్మీ, అక్కడి ప్రభుత్వాధికార్లు అందించిన సహకారం మరువలేనిదన్నారు. హీరోయిన్ రాశిఖన్నా మాట్లాడుతూ -సినిమా కోసం మీలాగే నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. వెంకటేష్ ఫ్యాన్ అయిన నేను, ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టమే. చైతూతో ఇది రెండో సినిమా. తనతో వర్క్ చేయడం ఓ ఫన్. మంచి సినిమాను ఆదరించండి అన్నారు. కార్యక్రమానికి వెంకీమామ టీం మొత్తం హాజరైంది.