వచ్చే 31న అశ్వథ్థామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్యాయాన్ని ఎదిరించే ‘అశ్వథ్థామ’గా ఆడియన్స్ ముందుకొచ్చేందుకు హీరో నాగశౌర్య డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. వచ్చే జనవరి 31న భారీఎత్తున సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ఇప్పటివరకూ ప్రేమ కథా చిత్రాల్లో క్యూట్ హీరో క్యారెక్టర్లు చేసిన నాగశౌర్య -కొత్త ప్రాజెక్టుతో యాక్షన్ టర్న్ తీసుకోవడం తెలిసిందే. సో, శౌర్య కెరీర్‌కు అశ్వథ్థామ ప్రాజెక్టు కీలకం కానుంది. ఈ సినిమాకు కథ అందించింది నాగశౌర్యే. మహా భారతంలోని అశ్వథ్థామ పాత్ర ఇంపాక్ట్‌తో, సొసైటీలోని కొన్ని యథార్థ ఘటనలను క్రోడీకరించి రాసుకున్న కథ ఇది. మహాభారతంలో ఓ ఇంపాక్టబుల్ క్యారెక్టర్ అశ్వద్థామ. కౌరవపక్షానేవున్నా, పాలనా దురాగతాలను ఎండగట్టిన పాత్ర ఆయనది. ద్రోణుని వరపుత్రుడిగా, పదకొండు రుద్రావతారాల్లో ఒక అవతారంగా, కురుక్షేత్ర యుద్ధంనుంచి ప్రాణాలతో బయటపడిన చిరంజీవిగా.. ఇలా అశ్వాద్థామ పాత్రకున్న ప్రాధాన్యం తక్కువేం కాదు. ఆ పాత్రను ఇప్పటి నేటివిటీకి అప్లై చేస్తూ రాసిన కథలో -అన్యాయాన్ని ఎదిరించే కథానాయకుడిగా నాగశౌర్య కనిపించనున్నట్టు చిత్రబృందం చెబుతోంది. నాగశౌర్యతో తొలిసారి మెహ్రీన్ జోడీకట్టింది. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై శంకర్‌ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన మూడో చిత్రమిది. కొత్త దర్శకుడు రమణతేజ తెరకెక్కించిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉంది. విడుదల తేదీ ప్రకటించేందుకు బుధవారం చిత్రబృందం నిర్వహించిన మీడియా సమావేశంలో -నాగశౌర్య యాక్షన్ స్టిల్‌తో కొత్త పోస్టర్‌నూ విడుదల చేశారు. -జనవరి 31న సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. ఐరా అధినేతలు శంకర్‌ప్రసాద్, ఉష, సహా నిర్మాత బుజ్జి మాట్లాడుతూ -ప్యాన్ ఇండియా మూవీ కేజీఎఫ్‌కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు ఆరివు టీం తెలుగులో తొలిసారి నాగశౌర్య సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారన్నారు. శౌర్య రాసుకున్న కథ, రమణ డైరెక్షన్ టెక్నిక్, శ్రీచరణ్ సంగీతం, మనోజ్ సినిమాటోఫ్రీ సినిమాకు ప్లస్ పాయింట్లన్నారు. అనుకున్న టైమ్‌లో సినిమా పూర్తి చేశామని, అంచనాను మించి అవుట్‌పుట్ రావడం హ్యాపీగా ఉందన్నారు. సినిమా బాగా రావడంలో ప్రతి టెక్నీషియన్ పనితనం ఉందన్నారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దామని వెల్లడించారు. రమణతేజ, శ్రీచరణ, మనోజ్, ఎడిటర్ గ్యారి మాట్లాడుతూ -ప్రాజెక్టును ప్రాణంపెట్టి చేశామని, అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.