అటొక మామ ఇటొక మామ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మజిలీ’ హిట్టుకొట్టి, మామతో కలిసి నాగచైతన్య చేస్తోన్న
మల్టీస్టారర్ -వెంకీమామ. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌ర్ల కెఎస్ రవీంద్ర తెరకెక్కించిన చిత్రం -వెంకటేష్
పుట్టినరోజు డిసెంబర్ 13న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నాగచైతన్య మీడియాతో మాట్లాడాడు.
*
ఆన్‌సెట్‌లో వెంకీమామ బిహేవియర్ -కామ్‌గా, పాజిటివ్‌గా ఉంటుంది. చాలామంది ఈ విషయాన్ని చెబితే విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశా. ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ టైమింగ్.. ఇలా కో ఆర్టిస్టులు చాలా నేర్చుకోవచ్చు.
రియల్ లైఫ్‌లో మా ఇద్దరిదీ క్వైట్ సైలెన్స్ బాండింగ్. దానికి డిఫరెంట్‌గా స్క్రీన్‌పై కనిపిస్తాం. ఆ వర్షన్‌కు అడాప్ట్ కావడానికి కొంత టైంపట్టింది. బట్, క్యారెక్టర్ల మధ్య బాండింగే -స్క్రిప్ట్‌కి బోనస్.
సినిమాలో నాదొక భిన్నమైన మాసీ క్యారెక్టర్. సిటీలో పెరిగి సెలవులకు భీమవరం వచ్చే పాత. ఫస్ట్‌టైం ఆర్మీ అటెంప్ట్ చేశా. అలాగే డిఫరెంట్ వర్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కథని ఏదైతే ఎలివేట్ చేసిందో -ఆ మిలటరీ పాత్ర కొత్తగా అనిపించింది.
నా యాక్టింగ్ కెరీర్ ఆరంభం నుంచీ వెంకీమామతో సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయాలనే ఆలోచన ఉంది. అన్నీ సెట్టయ్యేటప్పటికి ఈ టైం పట్టింది. కథ భీమవరంలో మొదలై, కాశ్మీర్‌లో ముగుస్తుంది. మామలిద్దరూ దర్శకుడితో కూర్చుని డిజైన్ చేసిన స్ట్రక్చర్ అది. నా కెరీర్‌కి ది బెస్ట్ మూవీయే కాదు, పెద్ద ప్లస్ కూడా.
కొరతలేనంత ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలో. మామ అల్లుళ్ల మధ్య సాగే శాక్రిఫైస్ లేయర్‌కి బాగా కనెక్టైపోయాను. బహుశ, అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇటీవలి కాలంలో తెరపైకి వచ్చుండవు. పైగా రియల్ లైఫ్ మామా అల్లుళ్లు ఈ పాత్రలు చేయడం మరింత పండుతుందనే అనుకుంటున్నా.
ఇద్దరు మామల సపోర్ట్ -వెంకీమామ. ఒకరు కెమెరా ముందు, మరొకరు వెనుక. ఇద్దరినుంచీ చాలా నేర్చుకునే అవకాశమిచ్చిన ప్రాజెక్టు ఇది.
‘మనం’లో రాశితో రెండు నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ ఆమెలో చాలా పరిణితి చూశా. ‘తొలిప్రేమ’ సినిమా చాలా ఇష్టం. పాయల్ సైతం తన పాత్ర బాగా చేసింది.
శేఖర్ కమ్ములతో చేస్తోన్న చిత్రంలో -మనసుకి దగ్గరైన పాత్ర చేస్తున్నా. అందుకే షూట్‌ని ఎంజాయ్ చేస్తున్నా. ‘లవ్‌స్టోరీ’ అనేది వర్కింగ్ టైటిలే. ఒరిజినల్ కన్‌ఫర్మ్ కాలేదు. అలాగే నాన్నతో కలిసి చేయబోయే ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ జరుగుతోంది. ఇంకొన్ని ప్రాజెక్టులు డిస్కషన్స్‌లో ఉన్నాయి. కన్‌ఫర్మ్ కాగానే వివరాలు చెబుతా.