బాలయ్యతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలయ్య ప్రాజెక్టుల్లో బాలీవుడ్ భామలు కొత్తేం కాదు. గతంలో బాలకృష్ణ చేసిన కొన్ని చిత్రాల్లో బాలీవుడ్ భామలు తళుక్కుమన్నారు. ఇప్పుడు -కొత్త ప్రాజెక్టుకూ బాలీవుడ్ భామకే చాన్స్ దక్కే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ చిత్రాన్ని పూర్తిచేసిన బాలయ్య -డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఆ వెంటనే బోయపాటి ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకూ రంగం సిద్ధం చేశాడు. యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రం -ఇటీవలే పూజాధికాలు పూర్తి చేసుకుని లాంఛనంగా మొదలైంది. బోయపాటితో చేయబోయే ప్రాజెక్టు కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాక్షిసిన్హాను సంప్రదిస్తున్నట్టు టాక్. ఆమెతోపాటు ప్రతినాయకుడి పాత్రనూ బాలీవుడ్ నుంచి తేనున్నారట. విలన్ రోల్‌లో సంజయ్‌దత్‌ను చూపించాలన్నది బోయపాటి ఐడియా. బలమైన ప్రతినాయక పాత్రతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ఆలోచనతో -బాలీవుడ్ నుంచి విలన్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు వస్తే ప్రాజెక్టుకు కొత్త క్రేజ్ ఖాయం.