ప్రేమ పెళ్లకి రెడీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్ పెళ్లికి రెడీ అయిపోయాడు. అదీ లవ్ మ్యారేజ్‌కు. ఇదీ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోన్న హాట్ న్యూస్. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఇంటివాడవుతడట. అంటే ఇంచుమించు ముహ్తూరం కూడా బయటకు వచ్చింది. కొంతకాలంగా ఓ బ్యూటీ లవ్‌లో మునిగి తెలుతున్న నితిన్ -పెళ్లి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాడట. అయితే, కాబొయే లైఫ్‌పార్టనర్ చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయి కాదని తెలుస్తోంది. కాకపోయినా ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తోంది. 2019లో అసలు స్క్రీన్‌కే రాకుండా లాంగ్ బ్రేక్ తీసుకున్న నితిన్ -ఒక్కసారిగా నాలుగు చిత్రాలు ప్రకటించటం తెలిసిందే. దర్శకుడు వెంకీ కడుములతో భీష్మ, వెంకీ అట్లూరితో రంగ్‌దే చిత్రాలను సెట్స్‌పైకి తెచ్చిన నితిన్, చంద్రశేఖర్ ఏలేటితో ఒకటి, కృష్ణచైతన్యతో మరొకటి కమిటై ఉన్నాడు. సో, 2020లో నితిన్ నుంచి కనీసం మూడు సినిమాలైనా ఆడియన్స్ ముందుకు రానున్నాయన్న మాట. ఇటీవల విడుదలై భీష్మ ఫస్ట్ గ్లిమ్స్ వీడియో మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో యంగ్ సెనే్సషన్ రష్మిక మండన్న హీరోయిన్ అన్న విషయం తెలిసిందే.