శృతి చూపు ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీ శృతిహాసన్‌కు తెలుగే దిక్కైంది. ఒకప్పుడు తెలుగులో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న కమల్ కూతురు, వరుస చాన్స్‌లు వద్దనుకుని బాలీవుడ్‌కు ఎగిరిపోయింది. అక్కడ కుదురుకున్న టైంలోనే ప్రేమలోపడి -సంగీతంలో కొట్టుకుపోయింది. స్క్రీన్ కెరీర్ నిర్లక్ష్యం చేయటంతో దాదాపు శ్రృతిహాసన్‌ను మర్చిపోయారు. ప్రియుడితో కటీఫ్ అయిన తరువాత వెనక్కి తిరిగి చూసిన శృతిహాసన్‌కు -కెరీర్ అగమ్యగోచరంగా కనిపించింది. తేరుకుని కెరీర్‌పై దృష్టిపెట్టి ఒకట్రెండ్ చాన్స్‌లు ఇప్పటికే అందుకుంది శృతిహాసన్. హిందీసహా తెలుగులోనూ సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతోంది. రవితేజ- గోపీచంద్ మలినేని సినిమాలో ఛాన్స్ కొట్టిన శృతి, మహేశ్‌బాబు తదుపరి ప్రాజెక్టుకూ గట్టిగా ప్రయత్నిస్తోందన్న మాట వినిపిస్తోంది. వంశీ పైడిపల్లి తెరకెక్కించే ప్రాజెక్టులో శృతికి దాదాపు బెర్త్ కన్ఫర్మ్ అయినట్టేనన్న మాట లేకపోలేదు.