హీరోయిన్‌గా కృతి చెల్లెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు హీరోగా నటించిన ‘1’ (నేనొక్కడినే) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన గ్లామర్ భామ కృతి సనన్‌కు ఆ తరువాత తెలుగులో అవకాశాలు వచ్చినా కూడా కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈమెకు నిరాశే మిగిలింది. దాంతో ఇప్పుడు తన చెల్లెలు నుపుర్ సనన్‌ను రంగంలోకి దింపుతోంది. అందానికి అందం, అభినయం కల నుపుర్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని తెలిసింది.
తెలుగులో క్రేజీ హీరోయిన్ల చెల్లెళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారు చాలామందే వున్నారు. అందులో అంబిక-రాధ, నిరోష-రాధిక, శాంతిప్రియ-్భనుప్రియ, అతిథి అగర్వాల్-ఆర్తీ ఆగర్వాల్, నిషాఅగర్వాల్-కాజల్ అగర్వాల్. తాజాగా నిక్కీగల్రాణి-సంజనలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. మరి ఇప్పుడు హీరోయిన్‌గా వస్తోన్న కృతి చెల్లెలు ఎలాంటి ఇమేజ్ తెచ్చుకోనుందో చూడాలి.

చిత్రం కృతి - నుపుర్