శ్రుతి కుదిరిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని ఇటీవలే మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథతో సాగే ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అనే్వషణ జరుగుతోంది. ఇప్పటికే మలయాళ భామ హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్‌ను హీరోయిన్‌గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రుతిహాసన్ తెలుగులో ‘ప్రేమమ్’ చిత్రంలో నటిస్తోంది. ఇదివరకే పవన్‌కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్‌సింగ్ సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రంలో కూడా ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాలని గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. మరోవైపు ఈ చిత్రానిక సేనాపతి అనే టైటిల్ పెడుతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ రానుంది.