నాని.. బొద్దుమంతుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని ల్యాండ్ మార్క్ సినిమా ‘వి’ని ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. డ్యూయల్ రోల్ చేస్తున్న నాని -పూర్తిస్థాయి విలన్ అవతారం ఎత్తనుండటం తెలిసిందే. మరోపాత్ర మాత్రం ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. సుధీర్‌బాబు పోలీస్ కాప్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాని కొద్దిగా బొద్దుగా కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. షార్ట్ హెయిర్ స్టయిల్‌తో లవర్‌బోయ్ లుక్ మేకోవర్‌కు వచ్చిన నాని గెటప్ -రెండో పాత్ర కోసమే అయి ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాత ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ అనే అంటున్నారు. ఇంతవరకూ ‘వీ’కి సంబంధించి ఎలాంటి లుక్ బయటకు రాకపోవడంతో -నాని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలోని రెండు పాత్రలకు సంబంధించిన లుక్‌లు ఎప్పుడు బయటకు వస్తాయన్న దానిపై చిత్రబృందం నోరు మెదపటం లేదు. అయితే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది కనుక, త్వరలోనే లుక్, టీజర్ బయటకు వస్తుందన్న అంచనాలు లేకపోలేదు. ఉగాది సందర్భంగా మార్చి 25న సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని తరువాత శివ నిర్వాణ తెరకెక్కించనున్న ‘టక్ జగదీష్’ ప్రాజెక్టు నాని చేయనున్నాడు.