ఉత్సాహంగా ఉన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఏడాదిలో ఉత్సాహంగా ఉన్నా. ఆరంభంలోనే నేను చేసిన రెండు సినిమాలు థియేటర్లకు వస్తుండటం హ్యాపీగా ఉంది. ఒకటి ఎంత మంచివాడవురా అయితే, మరొకటి జనవరి 31న వస్తున్న అశ్వథ్థామ. రెండు సినిమాలూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే అనుకుంటున్నా.
కల్యాణ్‌రామ్ హీరోగా సతీష్ వేగెశ్న తెరకెక్కించిన చిత్రం -ఎంత మంచివాడవురా. కల్యాణ్‌తో మెహ్రీన్ రొమాన్స్ చేయనుంది. సంక్రాంతి సందర్భంగా 15న సినిమా విడుదలవుతున్న సందర్భంలో మీడియాతో మెహ్రీన్ ముచ్చటించింది.
సినిమాలో నిర్మాత పాత్రనూ పోషించాను. అన్నిరకాల ఎమోషన్స్ ఉన్నాయి. బేసిక్‌గా కామెడీ అంటే ఇష్టం. అందుకే ఎఫ్2లోనూ ఆ పాత్ర నాకు కనెక్టైంది.
ఇదొక ఫ్యామిలీ డ్రామా. అన్నిరకాల ఎమోషన్స్‌తోపాటు యాక్షన్‌తో కూడిన కమర్షియాలిటీ హైలెట్‌గా ఉంటుంది. ఈమధ్యే విడుదలైన ట్రైలర్‌లో కామెడీ యాంగిల్‌కూ మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా మొత్తం అలాంటి కామెడీ ట్రాక్స్‌తో ఆకట్టుకుంటుంది.
ఇది పూర్తిగా గుజరాత్ చిత్రానికి రీమేక్ అనలేం. ఆ సినిమా నుంచి కథాసారాన్ని మాత్రం తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టు దర్శకుడు మలిచాడు. పాత్రలు సైతం చాలావరకూ మారాయి. అందుకే నా పాత్ర వరకూ నేను హార్డ్ వర్క్ చేశాను.
ఎంత మంచివాడవురా అన్న టైటిల్ -కల్యాణ్ రియల్ లైఫ్‌కూ వర్తిస్తుంది. వెరీ స్వీట్ పర్సన్. స్ట్రెయిట్ ఫార్వార్డ్ అండ్ హానెస్ట్. సెట్స్‌లో సింపుల్‌గా ఉంటాడు. మంచి ఆర్టిస్టువంటూ నన్ను బాగా సపోర్ట్ చేశారు. కల్యాణ్‌తో పని చేయడం చాలా హ్యాపీ ఫీలయ్యాను.
ఎఫ్2లో హాని పాత్రకు డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమాకూ చెబుదామని ప్రిపేరైనా -నా పాత్రకు కొన్ని పవర్‌ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. వాటిని సరిగ్గా ఉచ్ఛరించలేనని డబ్బింగ్ వేరే వాళ్లతో చెప్పించారు. నిజానికి అదే ప్లస్సైంది.
దర్శకుడు కథ చెప్పిన సందర్భంలోనే గూస్‌బంప్స్ వచ్చాయి. నా కెరీర్‌లో ఇంత బలమైన పాత్ర ఇప్పటి వరకూ చేయలేదు. పాత్ర చేయగలనా? లేదా? అన్న సందేహంలో ఉన్నపుడు దర్శకుడు ఎంకరేజ్ చేశారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే చేశా. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నా.