అక్క, వదిన పాత్రలు చేయలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్యాప్ ఇవ్వడానికి రాజకీయాలు కారణమైతే -రీఎంట్రీకి సరిలేరు కథ కారణం. ప్రొఫెసర్ భారతి పాత్రకు బాగా కనెకై సినిమా చేశాను అంటోంది విజయశాంతి. 13ఏళ్ల గ్యాప్ తరువాత మహేష్ హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారామె. సినిమాకు మంచి టాక్ రావడంతో, తన ఆనందాన్ని సోమవారం మీడియాతో పంచుకున్నారు విజయశాంతి
సినిమాలో రీఎంట్రీ?
సినిమా చేయమంటూ చాలాకాలంగా చాలామందే అడిగారు. రాజకీయాలు, సినిమాలు బ్యాలెన్స్ చేయలేనన్న ఉద్దేశంతో దూరంగా ఉండిపోయాను. కానీ, అనిల్ అప్రోచ్ అయినపుడు కథ మాత్రమే వినమన్నాడు. సందిగ్దంలోనే కథ విన్నా. ప్రొఫెసర్ పాత్ర బాగా నచ్చింది. మహేష్ సినిమా అనేసరికి కాదనలేకపోయాను.
ఆడియన్స్‌ని మిస్సైనట్టు..
ఆడియన్స్ జనమేగా. అప్పుడు సినిమాలతో టచ్‌లోవుంటే, తరువాత రాజకీయ సేవతో టచ్‌లోవున్నా. దీన్ని గ్యాప్ అనేకంటే -బ్రేక్ అనుకుంటున్నానంతే.
కరెక్ట్ టైంలో..?
సరైన సమయంలోనే రీఎంట్రీ కుదిరిందన్న భావనైతే ఉంది. జరిగేదంతా దేవుడు డిజైన్ చేసేదే. ఎంట్రీ ఇవ్వడంతోనే -నాకు హ్యూజ్ వెల్కమ్ లభించటం నా అదృష్టం. మంచి సినిమా చేశానంటుంటే హ్యాపీగానూ ఉంది. పవర్‌ఫుల్ పాత్ర కనుక మహిళలు బాగా కనెక్టయ్యారు. అందుకే, అక్క, వదినలాంటి మామూలు పాత్రలైతే చేయలేనేమో. ఏడాదికి ఒక్క సినిమా చేసినా -పాత్ర ప్రాధాన్యతకు ప్రాముఖ్యతనిస్తా.
రాములమ్మ ఇమేజ్..
రాములమ్మా మళ్లీ మమ్మల్ని ఏడిపించావంటూ ఆప్యాయంగా అంటున్నారు. కాకపోతే, ఆ రాములమ్మలాగ గొడ్డళ్లతో నరకడాలు ఈ కథకు సూటవ్వవు. ప్రొఫెసర్ పాత్ర కనుక ఆ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ డీసెంట్‌గా గాంభీర్యంగా చేశా.
మహేష్‌తో..
మహేష్ అప్పుడు పిల్లాడు. ఇప్పుడు సూపర్‌స్టార్. ఫస్ట్‌డేన గ్రాండ్ వెల్కమ్. ఒకట్రెండు రోజులు పెద్దగా మాట్లాడకున్నా, తరువాత చాలా కలిసిపోయాడు. అతనితో వర్క్ చేయడం హ్యాపీ అనిపించింది.
రీఎంట్రీతో..
చాలా హ్యాపీగావున్నా. 2020 సంక్రాంతికి ఇంత బిగ్గెస్ట్ సినిమాతో వస్తానని ఊహించలేదు. ప్రతి ఒక్కరికీ సమాజంలో బాధ్యతుండాలి. ఈ సినిమా అది సాధించింది. చాలాచోట్ల -మహిళలపట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఆ కోణంలోనూ దర్శకులు మంచి ఆలోచనలతో సరైన పాత్రను వండితే, సరిలేరులాంటి సిక్సర్లు సాధ్యమే.