రెజీనా.. రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరకు సరసమైన అందం -రెజీనా. పెర్ఫార్మెన్స్‌లోనూ రెజీనాను తగ్గించి చెప్పలేం. కాకపోతే -కెరీరే పడుతూ లేస్తూ సాగుతోంది. గతేడాది వచ్చిన ‘ఎవరు’తో మళ్లీ డిమాండ్‌లోకి వచ్చిన రెజీనా -ఇతర భాషల్లోనూ బాగానే సినిమాలు చేస్తూ వెళ్తోంది. ముఖ్యంగా నాయికా ప్రాధాన్యత కలిగిన కథలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈమధ్యే రెజీనా ఓ ద్విభాషా చిత్రానికి ఓకే చెప్పడం తెలిసిందే. తాజాగా ఆ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు జరుపుకుని సెట్స్‌మీదికి వచ్చింది. రాజశేఖర్ వర్మ నిర్మిస్తోన్న ఈ సినిమాకి కార్తీక్‌రాజు దర్శకుడు. ‘నిను వీడని నీడని నేనే’ ప్రాజెక్టుతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన కార్తీక్‌రాజు, ఈసారి నాయికా ప్రాధాన్యతా కథను తెరకెక్కించనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తారట. తమిళంలోనూ రెజీనాకు మంచి పాపులార్టీ ఉండటంతో -సినిమా వర్కౌటవుతుందన్న నమ్మకంతో చిత్రబృందం ఉంది.