తప్పులేదుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో కాంబోకి ఉండే క్రేజే వేరు. ఎవరెవరు? ఎనె్నన్నిసార్లు? ఈక్వేషన్లు, రేషియోల్లాంటి లెక్కలకు కొదవేం ఉండదు. ఇప్పుడు తాజాగా అలాంటి క్రేజీ కాబో కథనం ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అది త్రివిక్రమ్‌తో ప్రభాస్ సినిమా చేయడానికి ఉత్సుకత చూపిస్తున్నాడని. సహజంగానే ఎవరైనా దర్శకుడికి మంచి హిట్టుపడినపుడు -మిగతా హీరోలతో కాంబో ఈక్వేషన్ల కథనాలు పుట్టుకురావడం సహజం. అలాంటి గాసిప్పేనా? లేక నిజమా? అన్న సందిగ్ధం ఇండస్ట్రీలో లేకపోలేదు. ప్రస్తుతం ప్రభాస్ ‘జాన్’తో బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న చిత్రంతో పూజాహెగ్దె హీరోయిన్. ఇప్పటికే ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూరె్తైంది. దీని తరువాత ప్రభాస్ ప్రాజెక్టు ఏంటన్న? చర్చ లేచినపుడు -తాజాగా త్రివిక్రమ్‌తో అన్న డైలాగ్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ పేరు బలంగా వినిపించడానికి కారణం -ఒకటి కాంబో క్రేజీ. రెండు -త్రివిక్రమ్‌కి వరుస హిట్లుపడ్డాయి. మూడు -ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్, చరణ్, బన్నీలాంటి సమవుజ్జీ స్టార్లతో సినిమాలు చేశాడు. సో, ఈ కాలుక్యులేషన్స్ కొత్తగా ఉండాలంటే ప్రభాస్‌తో సినిమా చేయడమే. పైగా ఈమధ్య మంచి కథ దొరికితే -పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీయేనంటూ త్రివిక్రమ్ కూడా ఓ డైలాగ్ ఓపెన్ చేశాడు. తాజాగా బన్నీతో భారీబడ్జెట్‌లో సరదా సినిమా చేసిన త్రివిక్రమ్ -ప్రభాస్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పాన్ ఇండియా లెవెల్లో తీస్తాడా? తీసి కొత్త జోనర్‌కు షట్టర్లు తెరుస్తాడా? అన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఏం జరుగనుందో వెండితెరపైనే చూడాలి.