ఆ రెండూ.. ఇప్పుడు చెబుతున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల.. వైకుంఠపురములో సినిమా విడుదలయ్యే వరకూ రెండు విషయాలు దాచటం మావల్ల కాలేదు. అందులో ఒకటి -ఫైట్ సాంగ్‌కు రామలక్ష్మణులు కొరియోగ్రఫీ చేయటం. రెండోది -బ్రహ్మానందం సినిమాలో చిన్న పాత్ర చేస్తున్న విషయాన్ని దాచటం. ఇప్పుడింత సింపుల్‌గా చెబుతున్నా -వీటిని దాచటానికి మాత్రం మేం చాలా టెన్షన్ పడ్డాం అన్నాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అల్లు అర్జున్ -పూజా హెగ్దె జోడీగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సంక్రాంతి సినిమా -అల.. వైకుంఠపురములో. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌పై అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మించిన చిత్రం. సంక్రాంతి రేసులో బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ రావడంతో -సోమవారం థాంక్స్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ -సీరియస్ ఫైట్‌న్ జనపదంతో మేళవించి కొరియోగ్రఫీ చేయడం రామలక్ష్మణ్‌లకే సాధ్యమైందేమో. ఉత్తరాంధ్ర జనపదంలోని ‘చిత్రమైన’ పాట బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ను డిజైన్ చేసి -వైవిధ్యమైన పొయిట్రీలా తీర్చిదిద్దారు. నాకు నచ్చి పెట్టుకున్న పాట హిట్టయ్యింది. పైగా ఉత్తరాంధ్ర అంటే నాకు చాలా ఇష్టం. అందుకే -పాటను ఉత్తరాంధ్ర వాసులకు అంకితం చేస్తున్నా. బ్రహ్మానందం సినిమాలో ఉన్నట్టు ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరికీ చెప్పలేదు కూడా. రాములో రాముల సాంగ్ ఆడియో హిట్టయ్యింది. స్క్రీన్‌పై మరింత ఊపు తేవాలంటే, బ్రహ్మానందానికి సాధ్యమని ఆయన్ని పెట్టాం. కానీ, రివీల్ చేయలేదు. అడగ్గానే అంగీకరించిన బ్రహ్మానందానికి బిగ్ థాంక్స్. సినిమా విడుదల వరకూ ఈ విషయాన్ని దాచడం -ఏనుగుని గదిలో బంధించినంత కష్టమైంది. వేదికపై బ్రహ్మానందం తన అనారోగ్యం గురించి ప్రస్తావించారు. ఆయనకు అలాంటి సమస్య రాదని చెబుతున్నా. ఎందుకంటే -నవ్వించేవారెప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. ఇక, సునీల్ -విలన్ కావాలనుకుని ఇండస్ట్రీకి వచ్చాడు. నువ్వు కమెడియన్ అవుతావని చెప్పా. చిత్రమేంటంటే -మంచి కమెడియన్ అన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మడం లేదు. ఎప్పటికి నమ్ముతాడో తెలీదు. పూజా హెగ్దెను ప్రాజెక్టులోకి తీసుకోడానికి బలమైనవి కాకున్నా, మంచి కారణాలున్నాయి. ఆమె టైంకి వస్తుంది. అందంగా ఉంటుంది. బాగా నటిస్తుంది. వీటికితోడు -హార్డ్‌వర్కర్. ఈ క్వాలిటీసే -ఆమెను ప్రాజెక్టులోకి తీసుకునేలా చేశాయి. తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఏ సినిమాలోనైనా ఒకటో, రెండో పాటలు హిట్టవుతాయి. ఈ సినిమాలో ఆల్బమ్ మొత్తం హిట్. అతని ఎఫర్ట్ మొత్తం ఈ ఆల్బమ్‌కే పెట్టేశాడేమో. ఇకనుంచి తమన్ ప్రతిక్షణాన్నీ ఓ అద్భుతంగా మలచుకోవాలి.
ముఖ్యంగా -మొదలు, ముగింపు మొత్తం మోసింది హీరో బన్నీ. అల.. వైకుంఠపురములోకి ఆడియన్స్‌ని ఎంత బాగా తీసుకెళ్లాలి అన్న విషయంపైనే ఇద్దరం మాట్లాడుకునే వాళ్లకం. సినిమా ఆరంభం నుంచి ముగింపు వరకూ ఇద్దరి మధ్యా ఇది తప్ప మరేం మాటల్లేవు. బన్నీ తపనవున్న నటుడు. మంచి డ్యాన్సర్. స్టయిల్ ఎక్స్‌పర్ట్. మంచి డ్యాన్సర్ మరింత పర్ఫార్మర్ అయితే -సినిమా మొదటినుంచీ చివరి వరకూ వాళ్లిద్దర్నీ కంబైన్డ్ చేస్తే.. ఆ సినిమా ఎలా వస్తుందో అదే అల.. వైకుంఠపురమలో. మా ఆలోచన కూడా అదే. స్టార్డమ్, నటన రెంటినీ ఎంతగా బ్యాలెన్స్ చేయొచ్చో ఈ సినిమాలో చూపించాడు బన్నీ. ఆడియన్స్ అటెన్షన్ సంపాదించాడు కూడా. మంచి సందర్భంలో మంచి సినిమా పడితే తన స్టామినా ఎలా ఉంటుందో బన్నీ చేసి చూపించిన సినిమా ఇది. ఈ సక్సెస్‌లో ప్రాజెక్టులోని ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యముంది. అందరికీ కృతజ్ఞతలు. నవదీప్‌లాంటి ఆర్టిస్టులకి టైమ్ రావడం లేట్ కావొచ్చు. కానీ, రావడం మాత్రం పక్కా అన్నారు. హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ -ఆడియన్స్‌ని ఎంతగా ఎంటర్‌టైన్ చేయగలనో ఈ సినిమాతో నాకో ఆప్షన్ ఇచ్చినందుకు థాంక్స్. బన్నీ ఓ యాక్షన్ హీరో అన్న ఇమేజ్‌కు రామలక్ష్మణ్ కారణం. మొదటి సినిమా నుంచీ వాళ్లే నా యాక్షన్ కొరియోగ్రాఫర్స్. సినిమా మొత్తాన్ని తన కెమెరా నేత్రంతో మోసిన పిఎస్ వినోద్ బిగ్గెస్ట్ పిల్లర్. ఇక తమన్ మ్యూజిక్‌ని ఇష్టపడే ఆడియన్స్‌లో నేనొకడిని. ఎఫర్ట్ అంతా నా అల్బమ్‌కే పెట్టేశాడు. ప్రాజెక్టు నిర్మాతల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాతో ఇప్పటికి మూడు సినిమాల చేశారు. ఏ సినిమాలోనూ మాకు బాగా డబ్బురావాలి? అన్న ఆలోచన కనిపించలేదు. మా హీరోకి అద్భుతమైన స్టార్‌డమ్ రావాలన్న కాంక్షే వాళ్లలో కనిపించటం విడ్డూరం. పూజా హెగ్దెతో ఇది రెండో సినిమా. సాధారణంగా ఏ హీరోయిన్‌తోనూ రెండో సినిమా చేయను. అందుక్కారణం -ఆడియన్స్‌కి ఆ పెయిర్‌మీద బోర్ కొట్టేస్తుందని. కాని, పూజను రిపీట్ చేయడానికి కారణం -ఆమె బావుంటుంది. రిపీట్ చేసినా ఫరవాలేదనిపించింది. మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. ఇప్పుడు మళ్లీ రిపీట్ చేసినా ఫరవాలేదనిపిస్తుంది. నా సినిమాకు కొంత గ్యాప్ రావడంతో -ఈసారి భారీగానైనా సరదా సినిమా చేయాలనుకున్నా. అందుకు నాకు త్రివిక్రమ్ ఒక్కడే ఆప్షన్ కనిపించాడు. అలా మొదలైన ఇద్దరి డిస్కషన్స్‌లో కథనే హీరోగా చేసి సరదాగా చెప్పాలనుకున్నాం. ఆ పాయింట్ మీదే ఇద్దరం స్టక్కైపోయాం. అలా దర్శకుడు నాకో లైఫ్ ఇచ్చాడు. మా ఇద్దరికీ ఇది హ్యాట్రిక్ మార్క్ సినిమా అన్నాడు బన్నీ. కార్యక్రమంలో అల్లు అరవింద్, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, రాజేంద్రప్రసాద్, పూజాహెగ్దె తదితరులు మాట్లాడారు.