మరోసారి ప్రత్యేక పాటలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే ‘సర్దార్ గబ్బసింగ్’ సినిమాలో పవన్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడిన రాయ్ లక్ష్మి మరోసారి ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘పటాస్’ చిత్రాన్ని తమిళంలో రాఘవ లారెన్స్ హీరోగా ‘మెట్ట శివ కెట్ట శివ’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా నిక్కీగల్రాణి నటిస్తోంది. ఈ చిత్రంలో రాయ్‌లక్ష్మి ఐటెం సాంగ్ చేయనుంది. లారెన్స్-లక్ష్మీరాయ్‌లపై త్వరలోనే ఈ పాటను తెరకెక్కించనున్నారు. ఇదివరకే లారెన్స్‌తో కలిసి ‘కాంచన’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆమె ప్రస్తుతం హిందీలో రూపొందుతోన్న ‘జూలీ-2’ చిత్రంలో నటిస్తోంది. హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు ఐటెం గాళ్‌గా క్రేజ్ తెచ్చుకుంటోంది.