బన్నీకి ఫ్యాన్‌ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబొలో వచ్చిన హ్యాట్రిక్ హిట్ సినిమా -అల.. వైకుంఠపురములో. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కిన చిత్రంలో కథానాయిక అమూల్య పాత్రను పూజా హెగ్దె పోషించింది. పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో మంగళవారం మీడియావద్ద తన ఆనందాన్ని పంచుకుంది పూజ.
డబ్బింగ్ ఎక్స్‌పీరియన్స్?
-కొంచెం కష్టం కొంచెం ఇష్టం. తెలుగు పదాల్ని ఇంగ్లీష్ స్పెల్లింగ్స్‌తో ఉచ్చరించటం కష్టమే. బట్, వాయిస్ నేనే ఇవ్వడం వల్ల ఎక్స్‌ప్రెషన్స్ ఎలివేటయ్యాయి. మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాను. డబ్బింగ్‌కు ముందే ప్రిపేరయ్యాను కనుక, సీన్స్ తీసేటప్పుడే మాడ్యులేషన్ తెలుసుకున్నా. ఆ ప్రాక్టీస్ నాకు ప్లస్సైంది.
అరవిందకూ మీరేగా..?
-ఔను నేనే చెప్పా. అప్పటికీ ఇప్పటికీ తెలుగు లైన్లు అర్థం చేసుకుని ఎలా చెప్పాలో తెలుసుకున్నా. మనం మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా, ఒక్కోసారి డబ్బింగ్ వల్ల ఓవరయ్యే ప్రమాదం ఉంటుంది. కొందరైతే, మన పెర్ఫార్మెన్స్‌ను డబ్బింగ్‌తోనూ ఎలివేట్ చేసే వాళ్లుంటారు. అలాంటి వాళ్లంటే గౌరవం. ‘అరవింద సమేత’ చిత్రంలోనే నా డబ్బింగ్‌కు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అంటే -దాదాపు తెలుగమ్మాయిలా మాట్లాడానన్న భావన కలిగింది.
ట్యూటరున్నారా?
-లేదు. మేనేజర్‌తో, స్ట్ఫాతో తెలుగులోనే మాట్లాడతా. కోచింగంటూ ఏం లేదు. ప్రస్తుతానికి మ్యానేజ్ చేస్తున్నా. బట్, ఇంటర్వ్యూల్లో మాట్లాడాలంటే కొంత బెరుకుంటుంది.
బన్నీతో మూడోసారి..?
-ఇప్పటివరకూ బన్నీతో రెండు ప్రాజెక్టులు చేశా. దాంతో మామధ్య సెట్స్‌పై కంఫర్ట్ లెవల్ పెరిగింది. అదే పర్ఫెక్ట్ కెమిస్ట్రీగా ఆడియన్స్‌కి కనెక్టవుతుంది. అందుకే -రిపీట్ చేయాలని అనుకుంటున్నట్టు బన్నీ అనుంటాడు. కాంబినేషన్ రిపీట్ చేయాలన్న ఫీలింగ్ నాక్కూడా ఉంది.
అమూల్యలో నచ్చిందేంటి?
-్ఫస్ట్ నాకు స్క్రిప్ట్ నచ్చింది. త్రివిక్రమ్ నెరేట్ చేస్తుంటే పడిపడి నవ్వాను. పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుందని అనిపించింది. ఇంతకుముందు త్రివిక్రమ్‌తో చేసిన ‘అరవింద సమేత’ సీరియస్ సబ్జెక్ట్. బట్, ఇది ఫన్నీ సబ్జెక్ట్. అందులో స్ట్రాంగ్ క్యారెక్టర్. బన్నీకి బాస్‌ని. ఇన్ని ప్లస్‌ల మధ్య సెకెండ్ థాట్ లేకుండా ఓకే చెప్పేశా. బన్నీ క్యారెక్టర్ ఆలోచనా ధోరణిని మార్చే పాత్ర అమూల్య. అదే నాకు బాగా నచ్చింది.
త్రివిక్రమ్‌ని గురూజీ అన్నారు..?
-నేను వర్క్‌చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ వెరీ కామ్. డైరెక్టర్ ఎనర్జీయే సెట్లో వర్కౌటవుతుంది. సెట్లో డైరెక్టర్ నవ్వుతూ ప్రశాంతంగా కనిపిస్తే, ఆర్టిస్టులకు సగం స్ట్రెస్ మాయమైపోతుంది. తన స్థాయిని ఎప్పుడూ ప్రదర్శించని మంచి వ్యక్తి.
‘అల.. వైకుంఠమురములో’ని అమూల్య పాత్రతో నేను
మరింతగా తెలుగమ్మాయినైపోయాను. బాలీవుడ్‌లోని
చాలామంది నేను తెలుగమ్మాయినే
అనుకుంటున్నారు.
డైరెక్టర్ త్రివిక్రమ్ నవ్వుతూ ప్లజెంట్‌గా ఉంటాడు. ఓర్పు
ఆయన్నుంచే నేర్చుకున్నా. ఏ సీన్ అయినా సవివరంగా
చెప్పడంవల్ల ఆర్టిస్టులనుంచి మంచి ఎక్స్‌ప్రెషన్
రాబట్టే వీలుంటుంది. చివరకు పాటల్లోని ప్రతి
లైనుకూ అర్థాన్ని చెప్పడం గొప్ప విషయం.
ఏమాత్రం ఈగో లేకపోవడమే
ఆయనలో నచ్చే సుగుణం.
బన్నీతో డ్యాన్స్..?
సినిమాలో నాకు పెద్దగా డ్యాన్స్‌ల్లేవు. అన్నీ సింపుల్ స్టెప్స్. సో, రిహార్సల్స్ కూడా చెయ్యలేదు. బట్, బన్సీతో మ్యాచ్ చేయడానికి కష్టపడలేదు. కెరీర్ ఆరంభంలోనే -హృతిక్ రోషన్, అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్‌లాంటి గ్రేట్ డ్యాన్సర్స్‌తో వర్క్ చేశా. తాజాగా హిందీలో హృతిక్‌తో మళ్లీ చేస్తున్నా. వాళ్లందరితో డ్యాన్స్‌ల్లో మ్యాచయ్యాననే అనుకుంటున్నా.
ఫేవరేట్ సీన్..?
-‘బుట్టబొమ్మ’ సాంగ్ లీడ్ సీన్ చాలా ఇష్టం. అలాగే బోర్డ్ రూమ్ సీన్ బావుంది. ఆ రెండూ వెరీ ఫన్నీ.
బన్నీకి ఫ్యాన్ అన్నారు?
-యస్, బన్నీ ఫ్యాన్‌నే. తనతో కలిసి వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా. ప్రభాస్‌తోనూ అదే ఫీలింగ్ ఉంటుంది.
ఒకేసారి 3, 4ప్రాజెక్టులు. ఎలా?
ఆ సామర్థ్యం నాకుంది. తాజాగా తెలుగులో రెండు చేస్తున్నా. మరో రెండు హిందీలోనూ చేయగలను. ఇండియన్ స్టార్ నా లక్ష్యం. ఏదోక భాషకు పరిమితం కావాలనుకోను. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే అక్కడ సినిమాలు చేస్తా.
బాలీవుడ్‌లో సెకెండ్ స్టేజ్ పాత్రలు..?
హౌస్‌ఫుల్ 4లో సెకండ్ హీరోయిన్‌ని కాను. సగం అక్షయ్‌తో, మరోసగం రితీశ్‌దేశ్‌ముఖ్‌తో కనిపిస్తా. నేను ఇప్పటి వరకూ చేయలని స్లాప్ స్టిక్ కామెడీ కనుక చేశాను. ఆ గుడ్ ఎక్స్‌పీరియనే్స అల ప్రాజెక్టుకు ఉపయోగపడింది. డిఫరెంట్ రోల్స్‌లో ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యడం హ్యాపీ. వర్సటాలిటీయే నా బలం.
విమెన్ సెంట్రిక్ రోల్స్..?
-తెలుగులో మహిళా ప్రాధాన్యతా కథలు తక్కువే. అలాంటి స్క్రిప్ట్ ఒకటి వచ్చినా చేయలేదు. ఏదైనా నాకు నచ్చి చెయ్యగలననిపిస్తే చెయ్యడానికి సిద్ధమే. అదే నన్ను నటిగా మరోకోణంలో చూపిస్తుంది.