కొన్ని రిలేషన్స్ కొన్ని ఎమోషన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా మనకు మంచి సాయం చేసినపుడు -ఎంత మంచోడివిరా అంటాం. ఈ కథలో హీరో
తత్వం అలాంటిదే. అందుకే
-ఆ టైటిల్ పెట్టాం.
మంచిని పదిమందికీ
పంచేవాడు ప్రపంచానికే బంధువు -అన్న కానె్సప్ట్‌తో
వస్తోన్న సినిమా
ఎంత మంచివాడవురా.

కల్యాణ్‌రామ్, మెహ్రీన్ జోడీగా ఆదిత్య ప్రొడక్షన్స్‌పై సతీశ్ వేగెశ్న తెరకెక్కించిన చిత్రం -ఎంత మంచివాడవురా. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తోన్న చిత్రం సంక్రాంతి రోజున బుధవారం థియేటర్లకు వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ వేగెశ్న మీడియాతో ముచ్చటించారు.
మనుషులంతా మంచోళ్లే. అందులో కథానాయకుడూ ఉంటాడు. ఎవరికెలాంటి ఇబ్బంది వచ్చినా -తనవంతు సాయం అందించే తత్వం హీరోది. పాజిటివ్ వైబ్స్‌తో ఉండే పాత్ర.
మంచిని కోరుకునే వాడు కనుక -ఎంత మంచివాడవురా టైటిల్ ఫిక్స్ చేశాం. ప్రేమానురాగాలను బంధువులు, స్నేహితులే అందించాలన్న రూల్ ఉండదు. వాటిని పదిమందికీ పంచే ప్రతి ఒక్కరూ -ప్రపంచ బంధువే. ఆ విషయానే్న చెబుతుందిది.
కథ కోసం కల్యాణ్‌రామ్‌ను ఎంచుకున్నాం తప్ప, కల్యాణ్ కోసం రాసిన కథైతే కాదు. హీరోను దృష్టిలో పెట్టుకుని రాస్తే అవి కమర్షియల్ కథలవుతాయి. అంటే, హీరో ఇమేజ్‌కు తగ్గట్టు కథలో ఏదోకచోట కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. సో.. రాసుకున్న కథకు కల్యాణ్ సూటవుతాడనే ఎంచుకున్నా. ఇదే కరెక్ట్ అని నా అభిప్రాయం.
ఇంతకుముందు చేసిన రెండు సినిమాల్లో యాక్షన్‌కు స్కోప్ లేదు. కానీ, ఇందులో కథానుగుణంగా అవసరమైంది. అదీ అవసరం మేరకే చిత్రీకరించాం. ఎప్పుడూ ఒకే జోనర్‌లో చేసే హీరో, డైరెక్టర్.. కొత్త జోనర్‌లోకి వెళ్తే సహజంగానే ప్రేక్షకులకు అంచనాలు పెరుగుతాయి.
కల్యాణ్‌రామ్ చాలా యాక్షన్ చిత్రాలే చేశాడు. నేను యాక్షన్ సినిమా చేస్తే బాగోదు. అలా చేస్తే రెగ్యులర్ యాక్షన్ డ్రామా అయిపోతుంది. అందుకే -కల్యాణ్ ఇమేజ్‌కి తగినట్టు చిన్న స్మైల్ ఇచ్చాం. కథలో హీరో మెచ్యూర్డ్‌గా ఉంటాడు కనుక అలా డిజైన్ చేశాం. ఎంత మంచివాడవురా టైటిల్‌కు ఆప్ట్ అనిపించింది.
సంప్రదాయాన్ని మర్చిపోతున్న రోజులివి. అందుకే పెళ్లికి ఉండే విలువను గుర్తు చేసే ప్రయత్నం చేశాను. అన్ని వర్గాలకు కనెక్టయ్యే ఎమోషన్స్ సినిమాలో ఉన్నాయి. అలాగని మెసెజ్‌లు ఇచ్చే స్పీచ్‌లైతే ఉండవు.
చుట్టాలన్న మాటే మిగిలింది. అంతా ఒకచోట కలిసే సందర్భాలే కనిపించటం లేదు. కుటుంబాల్లోనే ఒకరొక కార్యక్రమానికి, మరొకరు మరో కార్యక్రమానికి వెళ్తోన్న పరిస్థితులు చూస్తున్నాం. మనుషులంతా ఒకచోటవుంటే ఆ ఆనందమే వేరు. అదే చూపించే ప్రయత్నం చేశా.
పిల్లలు దూరంగావున్న తల్లిదండ్రుల ఆవేదన.. పనిమనుషుల సంరక్షణలోవున్న పెద్దలను ఎలా ట్రీట్ చేయాలి? ఆప్యాయమైన పలకరింపుల కోసం వాళ్లు ఎలా ఎదరు చూస్తుంటారు అన్న ఎమోషనల్ కంటెంట్ చూపించా. సెన్సార్‌కీ అది బాగా నచ్చింది.
ఒకరికి రిలేషన్స్ కావాలి. మరొకరికి ఎమోషన్స్ కావాలి. ఆ రెంటి నేపధ్యంలో సినిమా ప్రేక్షకులకు నచ్చేలా సాగుతుంది. ఎఫ్2లో మంచి కామెడీ పండించిన మెహ్రీన్, ఎమోషన్స్ కూడా బాగా పండిస్తుందన్న నమ్మకంతో ఆమెను తీసుకున్నాం.
ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కూర్చోబెట్టే సీన్స్ రాసుకున్నా. జాతరని ఒక సన్నివేశంగా చూపించా. అందులో వచ్చే పాట ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. సినిమాలో రెండే పాటలు. అందరినీ అలరిస్తుందని అనుకుంటున్నా.
తాతకి మనవడిగా,
అక్కకి తమ్ముడిగా, అత్తకు
మేనల్లుడిగా అన్ని జనరేషన్స్‌నీ అలరిస్తాడు ఈ మంచివాడు.
ఆన్‌స్క్రీన్‌పై యాక్షన్ చేసినా,
ఆఫ్ స్క్రీన్‌లో
కల్యాణ్ ప్లజెంట్‌గా ఉంటాడు. అలాంటి అప్పియరెనే్స
ఆన్‌స్క్రీన్‌కు కావాలనుకున్నా. ఆయనా ఓకే
అనడంతో ప్రాజెక్టు మొదలైంది.