మళ్లీ భయపెడతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం హారర్ చిత్రాల హవా ఎక్కువవ్వడంతో దక్షిణాదిలో ఈ చిత్రాలను రూపొందించేందుకు దర్శక నిర్మాతలు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు హీరోయిన్లు కూడా ఈ తరహా చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకునేందుకు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ‘నాయకి’ చిత్రంలో నటిస్తోన్న త్రిష, ఇటీవలే తన 32వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరో హారర్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పిందట. మధురై ఫేం ఆర్.మాదేష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని, ఇటీవలే కథ విన్న త్రిష ఇంప్రెస్ అయి ఈ సినిమా చేయడానికి ఓకె చెప్పిందట. మే చివరి వారం నుంచి ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. లండన్‌లో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.