విలువలకు కనెక్టయ్యారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేక చిత్రాలు చేస్తుంటాం కానీ కొన్ని సినిమాలు గుర్తుండిపోయేలా ఉండాలని అనుకుంటాం. అటువంటి చిత్రమే ఎంతమంచివాడవురా. కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే ఈ చిత్రాన్ని చేశాము. చూసినవాళ్లంతా గుడ్‌ఫిలిం అంటుంటే సంతోషంగా వుంది అని హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ అన్నారు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్, మెహరీన్ జంటగా రూపొందించిన ‘ఎంతమంచివాడవురా’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన థాంక్స్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలో నటించిన ప్రతి నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని చిత్ర విశేషాలను వివరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ఎమోషనల్ సినిమాలు అనేసరికి కొంచెం ఆలోచిస్తా. ఎదుటివారి బాధను తన బాధగా చూసుకునే కథానాయకుడి పాత్ర అంటే కొంచెం యాప్ట్ అన్పించింది. ముఖ్యంగా పక్కింటివారి ముఖంలో చిరునవ్వు చూడాలనుకునే ఓ మంచి హీరో పాత్ర అది. అలాంటి పాత్రలు చేయాలని ఎప్పటినుంచో అనుకుంటా. ఈ సినిమా చూసి మా కుటుంబ సభ్యులందరూ మెచ్చుకుంటుంటే సంతోషంగా వుంది. ఒకరకంగా నా పర్సనల్ ఫిలిం ఇది. నా డైలాగ్ డెలివరీ, నన్ను చూపించిన విధానం చాలా నచ్చింది అని వివరించారు.
నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ- అందరూ బావుండాలని కోరుకునేది మా సినిమావాళ్ళే. అలాంటి పాత్రనే హీరోగా పెట్టి ఈ చిత్రాన్ని చక్కగా రూపొందించాడు దర్శకుడు. ఒక్క హీరోనే కాదు, ప్రతి పాత్రా ఈ చిత్రంలో నవ్విస్తుంది. చాలాఏళ్ల తరువాత కుటుంబ విలువలతో రూపొందించిన ఈ చిత్రం ఇంత విజయం పొందడం సంతోషంగా వుంది అన్నారు. దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ- నిర్మాతలు సినిమా మొదలైనప్పటినుంచి ఇప్పటివరకూ నాపైన అదే నమ్మకాన్ని ఉంచడం నాకానందాన్ని కలిగించే విషయం. సినిమా విడుదలైన రోజు పొద్దున ఫెయిల్ అన్నారు. మధ్యాహ్నానానికి విత్‌హెల్డ్ అన్నారు. ఫస్ట్‌షో టైమ్‌కు పాస్ అన్నారు. ఆ తరువాత సూపర్‌హిట్ అంటున్నారు. ఇది ఫ్యామిలీ మూవీ. కుటుంబ ప్రేక్షకులు అందరూ కూర్చుని చూడదగిన విధంగా రూపొందించాం. ఇపుడు ప్రతి థియేటర్‌లో ప్రేక్షకులు కుటుంబాలతో సహా వచ్చి ఆనందిస్తున్నారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఫోన్ చేసి చివరలో 15 నిమిషాలపాటు కన్నీళ్లు వచ్చాయని చెబుతుంటే గర్వంగా ఫీలవుతున్నాను. చాలా హ్యాపీగా వుంది. తూర్పుగోదావరి డిస్ట్రిబ్యూటర్ కూడా పెద్ద హిట్‌గా చెప్పడం ఆనందాన్నిస్తోంది. ఈ విజయాన్ని కళ్యాణ్‌రామ్‌తోపాటుగా మా యూనిట్ అంతా ఆస్వాదిస్తోంది అని ఆయన వివరించారు.