మేలో పవన్ పింక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా ప్రాజెక్టు టేకప్ చేయాలంటే దిల్ రాజు పక్కాగా ప్లాన్ చేస్తాడన్నది నిజం. తాజాగా -పింక్ కోసం పక్కా బ్లూప్రింట్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది. కేవలం నాలుగు నెలల్లో పింక్‌ను థియేటర్లకు తేవాలన్నదే దాని సారాంశం. జనవరి 20నుంచి షూట్ మొదలుపెట్టి, వచ్చే మే 23న సినిమాను థియేటర్లకు తేవాలన్న యోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. స్టార్ ఇమేజ్‌వున్న టైంలోనే పొలిటికల్ స్టెప్ తీసుకుని స్క్రీన్‌కు గ్యాప్పిచ్చిన పవన్‌కల్యాణ్ -రీమేక్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడన్నది తెలిసిన విషయమే. స్క్రీన్ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి పొలిటికల్ గ్యాప్‌లో సినిమా చేయమంటూ పవన్‌ని ఒప్పించిన దిల్ రాజు -ప్రాజెక్టుని నాలుగు నెలల్లో పూర్తిచేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేశారన్న కథనాలు వస్తున్నాయి. సంక్రాంతి సినిమాల హడావుడి నుంచి దిల్‌రాజు ఫ్రీ అయిపోవడంతో -ఈనెల 20నుంచే పింక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. కమర్షియల్ కాంపైన్‌కు వీలుగా -పింక్‌ను పవన్ ఫైట్ ఎపిసోడ్‌తో మొదలెట్టే అవకాశాలు లేకపోలేదు. పవన్ తన ఒరిజినల్ లుక్‌లోనే స్కీన్‌పై కనిపించే అవకాశముండటంతో, మేకోవర్ ప్రిపరేషన్‌కు టైం వెచ్చించే అవసరం లేదు. 20 రోజులు మాత్రమే పవన్ డేట్లు కేటాయించినట్టు కొద్దికాలంగా వినిపిస్తున్నదే కనుక, రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ముందు పవన్‌కల్యాణ్ పార్ట్‌ని పూర్తి చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. పింక్ ఒరిజినల్‌లో అమితాబ్ చేసిన పాత్రనే పవన్ చేస్తున్నప్పటికీ, తమిళ రీమేక్‌లో అజిత్‌కు హీరోయిన్‌ని పెట్టినట్టే.. తెలుగులోనూ పవన్‌కు జోడీ పెట్టే చాన్స్ లేకపోలేదు. అదే జరిగితే ఆ పాత్ర కోసం -వరుస హిట్లతో టాప్ హైప్‌లోవున్న పూజా హెగ్దెను ఒప్పించొచ్చని తెలుస్తోంది. పూజ ఓకే అంటే పింక్‌కు ప్రత్యేక ఆకర్షణ అవుతుందనటంలో సందేహం లేదు. ఇక హిందీలో తాప్సి, తమిళంలో శ్రద్ధాశ్రీనాథ్ చేసిన పాత్రను తెలుగులో అంజలి చేయనుంది. నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రలు చేస్తున్నారు. దిల్‌రాజు, బోనీకపూర్ సంయుక్త సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న రీమేక్‌కు వేణుశ్రీరామ్ దర్శకుడు. హాట్ సమ్మర్‌లో పవన్ సృష్టించే హీట్‌ని బట్టే -వరుసగా సినిమాలు చేస్తాడా? లేదా? అన్నది అంచనా వేయొచ్చు.