తారక్ ఏంచేస్తాడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల.. వైకుంఠపురములో చిత్రంతో అల్లు అర్జున్‌కి సెనే్సషన్ హిట్టిచ్చాడు దర్శకుడు త్రివిక్రమ్. హ్యాట్రిక్ కాంబోకి హిట్ జోడించి -్ఫ్యమిలీ ఎంటర్‌టైన్ జోనర్‌లో తన పట్టేంటో చూపించాడు కూడా. ఇంతవరకూ బాగానే ఉంది. త్రివిక్రమ్ తరువాతి ప్రాజెక్టు -జూ.ఎన్టీఆర్‌తో చేయాల్సివుంది. ఎన్టీఆర్ సైతం ఎప్పటినుంచో త్రివిక్రమ్ స్టయిల్లో తెరకెక్కే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఒకటి చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు. నర్మగర్భంగా ఆ విషయాన్ని సందర్భానుసారం ప్రస్తావిస్తున్నాడు కూడా. ఫ్లాపుల్లోవున్న బన్నీని గట్టెక్కించడానికి తనదైన ‘్ఫ్యమిలీ పాశుపతాస్త్రాన్ని’ ప్రయోగించేసిన త్రివిక్రమ్ -ఇప్పుడు ఎన్టీఆర్‌కు ఏంకథ చెప్తాడన్న ఆసక్తి ఇండస్ట్రీలో మొదలైంది. నిజానికి పవన్ కల్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’ చేసి భారీ వైఫల్యాన్ని మూటగట్టుకున్న త్రివిక్రమ్‌కు -తరువాతి ప్రాజెక్టును అలవాటైన స్టైల్లోనే చేయమని స్నేహితులు, సన్నిహితులు సలహా ఇచ్చారు. అయినా తెగువ చూపించి జూ.ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత.. వీరరాఘవ’లాంటి సీరియస్ సబ్జెక్టును భుజానికెత్తుకుని హిట్ చేసి చూపించాడు త్రివిక్రమ్. తరువాత -సరదా సినిమా చేద్దామన్న బన్నీ మాట కాదనలేక పాత ‘ఇంటిగుట్టు’లోని కోర్ కంటెంట్‌కు తనదైన టైమింగ్ కామెడీని మిక్స్ చేసి ‘అల.. వైకుంఠపురములో’ హిట్ చేసి చూపించాడు. అలాంటి లైటర్‌వీన్ ప్రాజెక్టును మరోసారి ప్రయోగిస్తే ఫలితం ఏమేరకు ఉంటుందో త్రివిక్రమ్‌కి తెలీందికాదు. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ చెప్పబోయే కథ -కామెడీ జోనర్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందా? లేక మళ్లీ సీరియస్ సబ్జెక్టునే చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎన్టీఆర్ నుంచి జనతాగ్యారేజ్‌కు ముందు, తరువాత ఫ్యామిలీ ఎంటర్‌టైనరే రాలేదు. అరవింద సమేత తరువాత రాజవౌళితో చేస్తున్న ట్రిపుల్ ఆర్ సైతం సోషియో ఫాంటసీ సీరియస్ మూవీ. సో, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని ‘కుటుంబ కథా చిత్రం’ చేద్దామంటే -త్రివిక్రమ్ ‘మూస’ను దాటుకొచ్చే ఎలాంటి కథను సిద్ధం చేస్తాడన్నది ఆసక్తికరం.