ఇస్మార్ట్.. హిట్టుకొడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాది బెంగళూరు.
టాలీవుడ్‌లో నాకంటూ పెద్దగా మిత్రులెవరూ
లేకపోవడంతో -షూట్ పూర్తి కాగానే బెంగళూరు వెళ్లిపోతాను. ఇప్పుడు ప్రాజెక్టులతో బిజీగా
ఉండటంతో, ఎవరితోనూ స్నేహం పెంచుకునేంత సమయం దొరకడం
లేదు -అంటోంది హీరోయిన్ నభానటేష్.
రవితేజ, నభానటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం -డిస్కో రాజా. వైవిధ్యమైన సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. 24న డిస్కోరాజా విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నభానటేష్ మీడియాతో ముచ్చటించింది.
గడచిన ఏడాది నా కెరీర్‌కు గొప్ప మలుపుగా భావిస్తున్నా. ఇస్మార్ట్ శంకర్‌లాంటి సూపర్ హిట్ సినిమా పడింది. ఎక్కడికెళ్లినా ఆ సినిమా ప్రస్తావనే వస్తోంది. సాంగ్స్ పాడమని, డైలాగ్స్ చెప్పమని అడుగుతున్నారు. ఈ ఏడాది మంచి గుర్తింపు తెచ్చుకుంటానన్న నమ్మకంతో ఉన్నాను.
తాజా చిత్రం డిస్కో రాజాపై నమ్మకంతో ఉన్నా. ఇదొక మాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ. కథా కథనాలు పూర్తిగా భిన్నం. ముఖ్యంగా దర్శకుడు విఐ ఆనంద్ శైలి, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన రవితేజ క్యారెక్టరైజేషన్ సినిమాకు పెద్ద ప్లస్.
ఈ సినిమాలో వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్ర పోషిస్తున్నా. గత చిత్రాలకు భిన్నమైన పాత్ర నాది. వెహికల్స్‌కి లోన్ అప్రూవ్ చేసే ఓ బ్యాంక్ ఎంప్లాయిని. ఎమోషన్స్‌కి విలువనిస్తూ, చుట్టూవున్నవాళ్ల గురించి ఆలోచించే మనస్తత్వం ఉన్న అమ్మాయిని. నిజానికి -ఈ పాత్ర నా నిజ స్వభావానికి దగ్గరగా అనిపిస్తుంది.
రవితేజ అంటేనే ఓ ఎనర్జీ. ఆయనతో కలిసి పని చేయడానికి ఎవ్వరైనా ఇష్టపడతారు. షాట్స్ గ్యాప్స్‌లో సెట్స్‌లో ఆయనతో చాలా సరదగా గడిచిపోయేది. సినిమాలు, ఫుడ్, ఆయన ఫార్మ్‌హౌస్‌లో పండించే ఫ్రూట్స్, వెజిటబుల్స్ గురించి మాట్లాడుతుంటే టైం తెలిసేది కాదు. షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేశా.
సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఉన్నా, ఆమెతో నాకు కాంబో సీన్స్ లేవు. నాకున్న సీన్స్ అన్నీ రవితేజ, సత్యం రాజేష్, నరేష్‌తోనే ఉంటాయి.
తదుపరి ప్రాజెక్టుగా సోలో బ్రతుకే సో బెటర్ ఉంటుంది. ఆ సినిమాలోనూ నా రోల్ నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. వైవిధ్యమైన పాత్ర దొరకడంపట్ల హ్యాపీగా ఉన్నా. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో మరో ప్రాజెక్టు ఉంది. తమిళంలోనూ ఓ స్టోరీ డిస్కషన్స్‌లో ఉంది. దాని వివరాలు త్వరలోనే చెబుతా.