యాక్షన్‌కు దిగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీకి కేరాఫ్ అడ్రెస్ అల్లరి నరేష్. తన టైమింగ్‌తో చాలాకాలం కెరీర్‌ను లాక్కొచ్చిన నరేష్, కొంతకాలంగా సరైన సినిమాలతో ఎంటర్‌టైన్ చేయలేకపోతున్నాడు. హీరోగా చేస్తోన్న కామెడీ చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుండటంతో -ఇప్పుడు సీరియస్ జోనర్‌కు దిగాడు. ఒకప్పుడు తక్కువ బడ్జెట్‌తో కామెడీగా తెరకెక్కిన ఎన్నో చిత్రాలతో ఆకట్టుకున్న నరేష్ -ఇప్పుడు సీరియస్ రోల్స్‌తో ఎంతవరకూ మెప్పించగలడన్న ఆసక్తి మొదలైంది. సిల్లీఫెలోస్, బంగారు బుల్లోడు లాంటి చిత్రాలు నరేష్‌ను పూర్తిగా నిరాశపర్చటంతో -హీరోగా చాలా గ్యాప్ తరువాత కొత్త దర్శకుడు విజయ్ కనకమేడలతో ఓ ప్రాజెక్టును ప్రకటించాడు నరేష్. ఎస్వీ2 బ్యానర్‌పై దర్శకుడు సతీష్ వెగెశ్న నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గతంలో నరేష్‌తో ‘దొంగలబండి’ చిత్రాన్ని తెరకెక్కించిన సతీష్ వేగెశ్న నిర్మాత కావడం, నరేష్ సీరియస్ పాత్రను చేస్తుండటంతో ప్రాజెక్టుపై కొంత ఆసక్తి లేకపోలేదు. రక్తమోడుతున్న నరేష్ పోస్టర్‌పై కొత్తగా కనిపిస్తున్నాడు. ఇంటెన్స్ క్యారెక్టర్‌తో వస్తున్న నరేష్ ఎంతవరకూ మెప్పిస్తాడనేది వెండితెరపై చూడాలి.