దిగాడు.. దేవగణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్‌డేట్స్ హంగామాల్లేకుండా కామ్‌గా తన పని పూర్తి చేస్తున్నాడు -ట్రిపుల్ ఆర్ దర్శకుడు రాజవౌళి. ఆ కారణంగానే ప్రాజెక్టుకు సంబంధించి ఏ చిన్న విషయమైనా పెద్దగా ప్రచారమవుతోంది. సినిమా ప్రారంభం టైంలో కథాంశానికి సంబంధించి రాజవౌళి చెప్పిన నాలుగు పొడి ముక్కలుతప్ప, తరువాత ఆ ప్రాజెక్టునుంచి పెద్దగా అప్‌డేట్స్ లేదన్నది వాస్తవం. సెట్‌చేసిన షెడ్యూల్స్ ప్రకారం పనిమాత్రం వేగంగానే సాగిపోతోంది. ప్రచారంలోని కథనాలు, గాసిప్స్‌కీ చిత్రబృందం అవుననికానీ, కాదనికానీ పెదవి విప్పకపోవడం -జక్కన్న తరహా కొత్త స్ట్రాటజీగానే కనిపిస్తోంది. ఇదిలావుంటే -ట్రిపుల్ ఆర్‌వైపు మళ్లీ దృష్టి సారించేందుకు తాజాగా సీన్‌లోకి అజయ్ దేవ్‌గణ్ దిగాడు. సంక్రాంతి తరువాత యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించే అవకాశం ఉందంటూ ఇప్పటివరకూ వస్తున్న కథనాలను నిజం చేస్తూ -జక్కన్న రాజవౌళి ఆ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. సినిమాలో కీలకమైన ఎపిసోడ్స్ షూట్ కోసమే బాలీవుడ్ స్టార్ అజయ్ దిగాడన్న టాక్ మొదలైంది. అజయ్ దేవ్‌గణ్ కనిపించే కీలక ఎపిసోడ్స్ చిత్రీకరణ నేడో రేపో మొదలుకావొచ్చన్నది చిత్రబృందం మాట. ప్రాజెక్టులో అజయ్ దేవగణ్ నటిస్తున్నట్టు చాలాకాలం క్రితమే వార్తలొచ్చినా -షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఈ ప్రాజెక్టు నుంచి ఇదే అప్‌డేట్ వచ్చింది. దర్శకుడు రాజవౌళితో అజయ్ కలిసివున్న ఫొటోను ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు. అయితే అజయ్ అప్పియరెన్స్‌కాని, అతని పాత్ర, దాని ఇంటెన్సిటీలాంటి వివరాలేమీ చిత్రబృందం రివీల్ చేయలేదు. సినిమాలో అజయ్ పాత్రతో ముడిపడిన సన్నివేశాలు అత్యంక కీలకమని, అవి గూస్ బంప్స్ ఇస్తాయన్న ప్రచారమైతే గట్టిగానే జరుగుతోంది. ఉద్యమ గమనానికి ముందు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లకు గురువుగా అజయ్ పాత్ర ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చరిత్రలో అల్లూరి, కొమురంలకు సంబంధమున్న ఘట్టాలే లేవు. రాజవౌళి పీరియాడికల్ ఫాంటసీలో వాళ్లిద్దరి మధ్య కనెక్టివిటీకి -గురువుగా అజయ్ దేవ్‌గణ్ పాత్రను డిజైన్ చేసి ఉండొచ్చన్న అంచనాలు లేకపోలేదు. అయితే, ఈ ముగ్గురి కలయికలో ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్‌ని రాజవౌళి డిజైన్ చేశాడన్న మాట వినిపిస్తోంది. జూలై 30న ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఆర్‌ఆర్‌ఆర్ -వెనక్కి జరిగి దసరాకు రావొచ్చన్న అంచనాలు లేకపోలేదు.