డిస్కోరాజా.. బిగ్ థాంక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిస్కోరాజాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంతమంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్స్ అన్నాడు రవితేజ. పీరియాడిక్, సైన్స్‌ఫిక్షన్ నేపథ్యంగా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన చిత్రం -డిస్కోరాజా. రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభానటేష్, తాన్యహోప్ హీరో హీరోయిన్లు. ఎస్సార్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రానికి విఐ ఆనంద్ దర్శకుడు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ -అబ్బూరి రవి, ఆర్ట్ డైరెక్టర్ నాగేందర్, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌లాంటి టెక్నీషియన్లు, రాంకీ, బాబీసింహా, సునీల్‌లాంటి ఆర్టిస్టులతో కలిసి పని చేయడం చాలా హ్యాపీనిచ్చింది. సునీల్, నేనూ ఇప్పటి వరకూ కామెడీ సినిమాల్లో నటించినా, ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలు పోషించాం. రెట్రో ఎపిసోడ్‌లో పాయల్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. వైవిధ్యమైన సినిమాల పట్ల ఆసక్తి చూపించే రామ్ తాళ్లూరి ఓ ఫ్యాషనేట్ నిర్మాత. ఆయనతో సినిమా చేసి సక్సెస్ కొట్టడం హ్యాపీగా ఉంది అన్నాడు. కమెడియన్ సునీల్ మాట్లాడుతూ -ఓ కమెడియన్‌కి విలన్‌గా మైలేజ్‌నిచ్చిన సినిమా ఇది. సిక్స్ ప్యాక్ తెలుగు విలన్‌గా అన్ని భాషల్లో పేరు తెచ్చుకోవాలనుంది. సినిమా మొత్తం సస్పెన్స్ మెయిన్‌టెన్ చేస్తూ దర్శకుడు విఐ ఆనంద్ అద్భుతమైన ప్రతిభను చూపారు. రవితేజ, రాంకీలాంటి గ్రేట్ ఆర్టిస్టులతో కలిసి పని చేయడం హ్యాపీగా ఉంది అన్నారు. చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ -రవితేజ బర్త్‌కే సక్సెస్ సెలబ్రేషన్ ఇచ్చానన్న సంతృప్తివుంది. సినిమా నిర్మించినపుడు ఎంత హ్యాపీ ఫీలయ్యానో, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తోందన్న టాక్ వింటూ అంతే ఆనందిస్తున్నా అన్నారు. బాబీసింహా మాట్లాడుతూ -హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిపర్చటం ఎవ్వరివల్లా కాదు. కానీ, సినిమాకు ఆడియన్స్ మంటి టాక్ నివ్వడం హ్యాపీగా ఉంది. సినిమా మరింత దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ -ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేశారు. ఏడాదిన్నర టైమ్ కేటాయించిన రవితేజకు థాంక్స్. కొన్ని సన్నివేశాలు మైనస్ డిగ్రీ టెంపరేచర్‌లో చేశాం. అందుకోసం టెక్నికల్, ఆర్టిస్టుల టీం ఎంతో కష్టపడింది. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నా. అన్ని పనులు జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతో ఎంకరేజ్ చేసిన రామ్ తాళ్లూరిలాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. మంచి సినిమా చేశానన్న సంతృప్తి ఉంది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నందుకు థాంక్స్ అన్నాడు.