ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత ఆయన నటించే మరో చిత్రానికి అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించే ఈ చిత్రం ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే కథ సిద్ధమైందని తెలిసింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించిన విషయం తెలిసిందే. రచయితగా వున్న వం శీ ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ నిర్మించడం విశేషం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.