నచ్చుతుంది.. మెచ్చుతారు కూడా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ జోడీగా శేష్ సింధూరావ్ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ -చూసీ చూడంగానే. గోపీసుందర్ సంగీతం సమకూర్చిన చిత్రాన్ని నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించారు. జనవరి 31న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో నిర్మాత రాజ్ కందుకూరి మీడియాతో మాట్లాడారు.
* కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఎక్కువగా కొత్తవాళ్లతో సినిమాలు చేస్తున్నా. ఆక్రమంలో వస్తున్న చిత్రమే -చూసీ చూడంగానే. కంటెంట్ బలంగావుంటే సినిమాను ఆడియన్స్ ఆదరిస్తుండటాన్ని చూస్తున్నాం. అందుకే మంచి కంటెంట్‌తో వచ్చే కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నా.
* నా ప్రొడక్షన్ హౌస్‌లో కొత్తగా వచ్చినవాళ్లు ఇప్పుడు అనేక ప్రొడక్షన్ హౌసుల్లో పని చేస్తున్నారు. ఏ షూటింగ్‌కు వెళ్లినా అక్కడ నానుంచి పరిచయమైన వాళ్లు ఒకరో ఇద్దరో కనిపిస్తారు. అప్పుడు కలిగే ఆనందానికి ఏ అవార్డూ సాటిరాదని అనిపిస్తుంటుంది.
* ఏటా ఒక డైరెక్టర్‌ని లాంచ్ చేస్తున్నా. కాకపోతే, లేడీ డైరెక్టర్‌ని లాంచ్ చేయలేకపోతున్నానన్న చిన్న అసంతృప్తి ఉండేది. అది శేష్ సింధూరావ్‌తో నెరవేరింది. ఆమె కథ చెప్పిన తీరు, మేకింగ్‌పై ఆమెకున్న అవగాహన నన్ను మెప్పించాయి. నమ్మకం కలిగాకే అవకాశం ఇచ్చా.
* నా సినిమాలో మా అబ్బాయిని పెట్టుకున్నానని చాలామంది అనుకోవచ్చు. బట్, జెన్యూన్‌గా సాగే ప్రాసెస్ నుంచే శివ వచ్చాడు. డైరెక్టర్ తనకు ఎన్నో విధాల ఆడిషన్స్ నిర్వహించాకే ఎంపిక చేసుకుంది. తన కథలోని పాత్రకు శివ పర్ఫెక్ట్ అని ఆమె సజెస్ట్ చేసిన తరువాతే -నేనూ ఒకే చేశా.
* సినిమాతో ఫస్ట్‌నుంచీ సురేష్‌బాబుతో టచ్‌లో ఉన్నా. సినిమా కొలిక్కి వచ్చిన తరువాత లెంగ్త్ విషయంలో ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. ఆయనకు ఉన్న అవగాహనను దృష్టిలో పెట్టుకుని -ఎక్కడా ఫ్లో మిస్ అవ్వకుండా నిడివిని గంటా యాభైమూడు నిమిషాలకు కుదించాం.
* ఈ సినిమాలు పెద్దవాళ్లు ఎందుకు చూడాలంటే -ఎక్కడా అశ్లీలం అన్నది లేకుండా స్వచ్ఛమైన ప్రేమ కథను మాత్రమే తెరకెక్కించాం. ఇక యూత్ ఎందుకు చూడాలంటే -ఓ కామన్ బోయ్ అచీవ్‌మెంట్ స్టోరీ కనుక. శివ పాత్రను చూసినపుడు ఇది నా పాత్రలానే ఉందే అనుకుంటారు. అది గ్యారెంటీ.
* సినిమాలో శివ పెర్ఫార్మెన్స్ గురించి తండ్రిగా చెప్తే అతిశయోక్తి అనుకుంటారు. బట్, నేను ఊహించిన దానికంటే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. శివను తీసుకోవడం నిర్మాతగా నా బెస్ట్ డెసిషన్ అనుకుంటున్నా.
* ఎక్కువ సినిమాలు చేసేయాలన్న ఆలోచనలు నాకు ఎంతమాత్రం లేవు. ప్రతీ ఏటా ఒక సినిమా అయితే కచ్చితంగా చేస్తా. ఈ ఏడాది సినిమా ఏప్రిల్ నుంచి మొదలుకావొచ్చు.