వరల్డ్ లవర్ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ సెనే్సషన్ విజయ్ దేవరకొండతో క్రాంతిమాధవ్ తెరకెక్కిస్తోన్న చిత్రం -వరల్డ్ ఫేమస్ లవర్. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై వల్లభ రూపొందిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి సంబంధించిన రెండో పాట నేడు విడుదల చేయనున్నారు. బొగ్గుగనిలో చిత్రీకరించిన పాటలో విజయ్ దేవరకొండ, క్యాథరిన్ కన్పిస్తున్నారు. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజెబెల్లే సైతం విజయ్ సరసన హీరోయిన్లుగా కనిపించనున్నారు. చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బొగ్గు గనిలో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ సీన్స్‌ను దర్శకుడు వైవిధ్యంగా చిత్రీకరించి తన మార్క్ చూపించాడని యూనిట్ చెబుతోంది. ఇదేవిధంగా సినిమా అంతా కమర్షియల్ సక్సెస్ కోసమే సరికొత్తగా డిజైన్ చేసినట్టు తెలిపారు. గోపీసుందర్ అందించే బాణీలు సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయని, విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రాంతిమాధవ్ ఈ చిత్రంతో మరో హిట్ కొట్టనున్నారని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ, క్యాథరిన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు వైవిధ్యంగా వుంటాయని, అదేవిధంగా మిగతా ముగ్గురు హీరోయిన్లపై చిత్రీకరించిన పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాయని, ఒకరకంగా ప్రేమికులకు నిజమైన కానుకగా చిత్రాన్ని అందిస్తున్నామని యూనిట్ చెబుతోంది.